కాపర్ టాక్సిసిటీ అంటే ఏమిటి..? ఇది ఎందుకు వస్తుంది..?
సాక్షి లైఫ్ : "కాపర్ టాక్సిసిటీ" అంటే అధిక రాగి, శరీరంలో రాగి పరిమాణం సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కలిగే పరిస్థితి. రాగి శరీరానికి అవసరమైన ఖనిజం. కానీ శరీరంలో అధికకంగా ఉంటే ఆరోగ్యానికి హానికలుగుతుంది. కాపర్ టాక్సిసిటీ కొన్ని లక్షణాలను ఎలా గుర్తించాలి..? దీనివల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వచ్చే గుండెజబ్బులను ఎలా నివారించాలి..?
ఇది కూడా చదవండి..రాగి పాత్రలో నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారా..?
ఇది కూడా చదవండి..ఏ సీజన్ లో స్ట్రోక్ ప్రమాదం పెరిగే అవకాశాలున్నాయి..?
కాపర్ టాక్సిసిటీ వల్ల కలిగే కొన్ని అనారోగ్య సమస్యలు..
కడుపు నొప్పి, వికారం : శరీరంలో అధిక మొత్తంలో రాగి ఉండడం వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి.
తలనొప్పి, తలతిరుగుడు: బాడీలో రాగి ఎక్కువ అవ్వడం వల్ల తలనొప్పి, తలతిరుగుడు ,అలసటకు కారణమవుతుంది.
కాలేయం, మూత్రపిండాలకు ప్రమాదం : అధిక మొత్తంలో రాగి కాలేయం ,మూత్రపిండాలను దెబ్బతీస్తుంది, అంతేకాదు శరీరంలో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మానసిక సమస్యలు : రాగి ఎక్కువ అవ్వడం వల్ల ఆందోళన, డిప్రెషన్ , మానసిక స్థితిలో మార్పులు వంటి మానసిక సమస్యలను కలిగిస్తుంది.
చర్మ సమస్యలు: రాగి అధికమవ్వడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదతోపాటు, ఇతర సమస్యలు తలెత్తుతాయి.
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ కు మెనోపాజ్ కు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
