Ignoring Sleep Means Inviting Diabetes : నిద్రను నిర్లక్ష్యం చేయడం అంటే మధుమేహాన్ని ఆహ్వానించడమే : తాజా అధ్యయనం..!

షేర్ చేయండి:
Ignoring Sleep Means Inviting Diabetes : నిద్రను నిర్లక్ష్యం చేయడం అంటే మధుమేహాన్ని ఆహ్వానించడమే : తాజా అధ్యయనం..!

సాక్షి లైఫ్ : ప్రస్తుత తరంలో ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది రాజీ పడే అంశం 'నిద్ర'. అయితే, నిద్రను నిర్లక్ష్యం చేయడం అంటే నేరుగా మధుమేహాన్ని ఆహ్వానించడమేనని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కేవలం ఒక్క రాత్రి సరిగ్గా నిద్రపోకపోయినా, మరుసటి రోజు ఉదయానికల్లా మీ శరీరం 'ప్రీ-డయాబెటిక్' స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

అధ్యయనం ఏం చెబుతోంది..?


ఇటీవల కొందరిపై జరిపిన పరిశోధనలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. నిద్ర నాణ్యత తగ్గడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్షణమే ప్రభావితమ వుతుంది. గాఢ నిద్ర లేనప్పుడు, రక్తంలోని చక్కెరను కణాలకు చేరవేసే ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయదు. నిద్ర లేమి వల్ల శరీరంలో 'కార్టిసాల్' అంటే స్ట్రెస్ హార్మోన్ పెరిగి, అది చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది.

ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి..?

రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి, మధుమేహం (Type 2 Diabetes) స్థాయికి కొంచెం తక్కువగా ఉండటాన్ని 'ప్రీ-డయాబెటిస్' అంటారు. దీనిని సకాలంలో గుర్తించి జీవనశైలి మార్చుకోకపోతే, అది శాశ్వత మధుమేహంగా మారే అవకాశం ఉంది.

 

నిద్ర నాణ్యత పెరగాలంటే..


మంచి నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, అది ఒక ఔషధం. ఇందుకోసం ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరి.  ప్రతిరోజూ రాత్రి ఒకే సమయానికి పడుకోవడం, ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోండి. పడుకోవడానికి గంట ముందే మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు పక్కన పెట్టేయండి. వీటి నుంచి వచ్చే 'బ్లూ లైట్' నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్‌ను అడ్డుకుంటుంది.

రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పడుకునే ముందు కాఫీ, టీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. పడకగది చీకటిగా, చల్లగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. మీకు తరచుగా నిద్రలేమి సమస్య వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అంతేకాదు నిద్రను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా రోజుకి 7 గంటల నుంచి 8 గంటల వరకూ ఆరోగ్యకరమైన నిద్ర.. ప్రతి ఒక్కరికీ అవసరమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.