నోరోవైరస్ అంటే ఏమిటి..? 

షేర్ చేయండి:
నోరోవైరస్ అంటే ఏమిటి..? 

సాక్షి లైఫ్ : నోరోవైరస్ గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు కారణమయ్యే వైరస్‌ల సమూహం. ఈ వైరస్ కడుపు, ప్రేగుల వాపు, తీవ్రమైన వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. నోరోవైరస్ సోకిన కొన్ని గంటల వ్యవధిలోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇది కలుషితమైన నీరు లేదా కలుషితమైన ఆహారం ద్వారా సంభవిస్తుంది. దీనిని స్టమక్ బగ్ అని, స్టమక్ ఫ్లూ అని కూడా అంటారు.  

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? 

నోరోవైరస్ సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులలో స్వల్పంగా ఉన్నప్పటికీ, ఇది చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర అంతర్లీన వైద్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు సోకినట్లయితే అది తీవ్రంగా ఉంటుంది.

వ్యాధి ఎలా సంక్రమిస్తుంది..?

నోరోవైరస్ అనేది జూనోటిక్ వ్యాధి. ఈ వ్యాధి కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా కూడా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి మలం, వాంతి ద్వారా వ్యాపిస్తుంది. నోరా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది చాలా అంటువ్యాధి.

ఇది కూడా చదవండి..  ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.