రెటినోబ్లాస్టోమా అంటే ఏమిటి..? ఇది ఎలాంటివాళ్లకు వచ్చే ప్రమాదం ఉంది..?
సాక్షి లైఫ్ : రెటినోబ్లాస్టోమా అనేది కంటి రెటీనా కణాలలో అభివృద్ధి చెందే ఒక అరుదైన కంటి క్యాన్సర్. ఇది సాధారణంగా చిన్న పిల్లలలో, ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రెటీనా అనేది కంటి వెనుక భాగంలో ఉండే కాంతి-సున్నితమైన కణజాలం, ఇది మనం చూడటానికి సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి..బలమైన కండరాల కోసం : అధిక ప్రోటీన్ కలిగిన ఐదు నట్స్..
ఇది కూడా చదవండి..ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా శరీరంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఆయుర్వేదం : వేప ఆకులలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
రెటినోబ్లాస్టోమా క్యాన్సర్ ఇది ఒక్కోసారి ఒకటి లేదా రెండు కళ్ళను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. 20 నుంచి 30శాతం కేసులు వంశపారంపర్యంగా వస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంటే ఇది ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో కూడా ఇలాంటి కేసులు సంభవిస్తాయి.
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 4వేల నుంచి 5వేల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి, వాటిలో 1500 నుంచి 2000 కేసులు భారతదేశంలోనే వస్తున్నాయి.
ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?
ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
