రక్తంలో చక్కెర స్థాయిలు ఎంత ఉంటే నార్మల్..?

షేర్ చేయండి:
రక్తంలో చక్కెర స్థాయిలు ఎంత ఉంటే నార్మల్..?

సాక్షి లైఫ్ : డయాబెటీస్ ఉన్నవారైనా లేనివారైనా సరే బ్లడ్ షుగర్ లెవల్స్ ఎంత ఉండాలి..? ఎంత ఉంటే నార్మల్ గా పరిగణిస్తారు..? అనేవి తప్పనిసరిగా తెలుసు కోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవడం అనేది మధుమేహ నియంత్రణకు చాలా అవసరం. తద్వారా మీ ఆరోగ్యం ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

ఇది కూడా చదవండి..మధుమేహానికి ప్రత్యామ్నాయంగా బెల్లం, తేనె లేదా స్టెవియాలను వాడొచ్చా..?

ఇది కూడా చదవండి.. స్మోకింగ్ అలవాటు లేనివారు లంగ్ క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? 

ఇది కూడా చదవండి.. మ‌తిమ‌రుపునకు చికిత్స సాధ్య‌మేనా..?

 

- సాధారణ స్థాయి (Normal)..  

మీ రక్తంలో చక్కెర స్థాయి 70-99 mg/dL మధ్య ఉంటే అది సాధారణమైనదిగా పరిగణిస్తారు. ఈ రేంజ్‌లో ఉన్నవారు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం.

-ప్రీ-డయాబెటిస్ (Pre-Diabetes)..  

మీ రక్తంలో చక్కెర స్థాయి 100-125 mg/dL మధ్య ఉంటే, మీకు ప్రీ-డయాబెటిస్ ఉందని అర్థం. ఈ దశలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే, అది మధుమేహంగా మారే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా ఈ పరిస్థితిని సరిదిద్దుకోవచ్చు.

-మధుమేహం (Diabetes)..
  
మీ బ్లడ్ షుగర్ స్థాయి 126-199 mg/dL మధ్య ఉంటే అది మధుమేహంగా పరిగణిస్తారు. ఈ దశలో మీరు వైద్యుల సలహా తీసుకోవడం, మందులు వాడటం తప్పనిసరి.

-అత్యధిక స్థాయి (Very High)..  

మీ రక్తంలో చక్కెర స్థాయి 200 mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది చాలా ప్రమాదకరం. దీనివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.

 

ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గల ప్రమాద కారకాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..పాదాలలో ఈ మార్పులు అధిక కొలెస్ట్రాల్ కు సంకేతాలు.. 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..?

 

గమనిక: ఈ స్థాయిలు ఖాళీ కడుపుతో (fasting) ఉన్నప్పుడు తీసుకున్న పరీక్షకు సంబంధించినవి. భోజనం తర్వాత లేదా ఇతర పరిస్థితుల్లో ఈ స్థాయిలు మారవచ్చు. పూర్తి వివరాల కోసం వైద్యనిపుణులను  సంప్రదించడం మంచిది.

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.