దంతాల ఆరోగ్యం మెరుగుపడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? 

షేర్ చేయండి:
దంతాల ఆరోగ్యం మెరుగుపడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? 

సాక్షి లైఫ్ : దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. శరీరం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన దంత సంరక్షణ కూడా అవసరం. నోటి పరిశుభ్రత పాటించకపోతే దంత క్షయం, చిగుళ్ల వ్యాధులు వస్తాయి. దంతాల ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని తినాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. యాపిల్స్ పళ్లలో 'కావిటీస్'ను నివారిస్తాయి. యాపిల్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చిగుళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

  ఇది కూడా చదవండి..సీజనల్ వ్యాధులకు సరైన ఔషధం ఇది..

పండ్లు, కూరగాయలు..

విటమిన్ "సి" పుష్కలంగా ఉన్న పండ్లు, కూరగాయలు దంత ఆరోగ్యానికి మంచివి. అందుకోసం నారింజ, నిమ్మ, పైనాపిల్, టమాటా, దోసకాయలు మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. పాలు, చీజ్, పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి దంతాల ఎనామిల్‌ను రక్షించడమేకాకుండా దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పాల ఉత్పత్తులలోని పోషకాలు బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కొన్ని ఆమ్లాలను తటస్థీకరిస్తాయి. ఈ విధంగా దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

దంతాల ఆరోగ్యానికి..

స్ట్రాబెర్రీలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆకు కూరలు.. వీటిలో ఉండే విటమిన్ "ఏ" , 'ఫోలిక్ యాసిడ్' దంతాలు , చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కనుక పాలకూర, బ్రకోలీ వంటి ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవచ్చు. నట్స్ లో అనేక పోషకాలు, విటమిన్లు ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం ద్వారా దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకోసం బాదం, వాల్ నట్స్ మొదలైన వాటిని రోజువారీ డైట్ లో చేర్చుకోవాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

  ఇది కూడా చదవండి.. సహజంగా మెరిసే చర్మం కోసం సరైన చిట్కాలు

  ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.