సాక్షి లైఫ్ : పునరుత్పత్తి చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఈస్ట్రోజెన్. సాధారణంగా చిన్న వయసులోనే పీరియడ్స్ ఆగిపోవడాన్ని "ప్రీ-మెనోపాజ్" అంటారు. ఈ కాలంలో, మహిళలు గర్భవతి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రీ-మెనోపాజ్ సమస్య జీవనశైలి లో మార్పులు ,ఆహారపు అలవాట్లకు సంబంధించిన సమస్య అని గైనకాలజిస్టులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. లేట్ నైట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు..?
ఇది కూడా చదవండి.. వంట నూనెకు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ముఖ్యంగా మహిళల్లో ప్రీ-మెనోపాజ్ రావడానికి చాలా కారణాలున్నాయి. 45 -55 సంవత్సరాల మధ్య వయస్సులో మహిళల అండాశయాలు గుడ్లు ఉత్పత్తి ఆగిపోతుంది. దీని కారణంగా ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి.
ప్రీ-మెనోపాజ్‌కి కారణాలు..?
అండాశయాలలో శస్త్రచికిత్స, ఏదైనా వ్యాధికి ఇచ్చే రేడియేషన్, అతిగా మద్యం సేవించడం,ధూమపానం చేయడం, కీమోథెరపీ, వంశ పారంపర్యంగా కూడా ప్రీ-మెనోపాజ్ తలెత్తడానికి కారణాలుంటాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ఇది కాకుండా, కొన్ని ఆటో ఇమ్యూన్ పరిస్థితులు లేదా ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్‌లు ఆడవారిలో సర్వసాధారణంగా ఉంటాయి. దీని కారణంగా పీరియడ్స్ సడెన్ గా ఆగిపోతాయి.
ప్రీ-మెనోపాజ్ లక్షణాలు..ఎలా ఉంటాయి..?
ప్రీ-మెనోపాజ్ సమయంలో మహిళలకు చిరాకు, యోనిలో దురద, రొమ్ములలో వాపు, అధిక వేడి, రొమ్ములలో తేలికపాటి నొప్పి, లైంగిక కోరిక కోల్పోవడం, మానసిక సమస్య, ఎక్కువగా చెమటలు పట్టడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అంతేకాదు పని చేయకపోయినా చేసినా ఎటువంటి కారణం లేకుండా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ లక్షణాలు మెనోపాజ్‌కు 6-7 నెలల ముందు కనిపిస్తాయి.
ప్రీ-మెనోపాజ్‌ని ఎదుర్కోవటానికి పరిష్కార మార్గాలు..
ఆరోగ్యకరమైన ఆహారం..
మహిళలు తమ ఆహారంలో పోషకాహారాన్ని చేర్చుకోవడం ద్వారా శారీరకంగా,మానసికంగా హెల్తీగా ఉండవచ్చు. మహిళలు ముఖ్యంగా క్యాల్షియం మరియు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ముప్పు పెరుగుతుంది.
వ్యాయామం..
మంచి నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతాయి. మెనోపాజ్ కారణంగా బరువు కూడా వేగంగా పెరుగుతారు. వ్యాయామం చేస్తే బరువును నియంత్రించవచ్చు.
వేడిని పెంచే ఆహారానికి దూరంగా ఉండండి..
కెఫిన్, ఆల్కహాల్ , స్పైసీ ఫుడ్ తీసుకోవడం మానుకోండి. వీటిని తీసుకోవడం వల్ల మెనోపాజ్ సమయంలో అధికంగా వేడి చేస్తుంది. ఎందుకంటే ఈ ఆహారాలు మెనోపాజ్ సమయంలో సంభవించే 'హీట్ ఫ్లాషెస్'ని ప్రోత్సహిస్తాయి.
పుష్కలంగా నీరు తాగాలి..
మెనోపాజ్ కారణంగా మహిళలల్లో చర్మం, జుట్టు, గోర్లు పొడిగా మారుతాయి. ఈ సమస్యలను నివారించడానికి తగినంత నీరు తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రీ-మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com