హైపర్‌టెన్షన్ నియంత్రణకు చేయకూడనివి, చేయాల్సినవి..?
సాక్షి లైఫ్ : హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది నిశ్శబ్ద వ్యాధిలా ఉంటుంది దీన్ని ఎప్పటికప్పుడు గుర్తించి, నియంత్రించకపోతే గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే, దీనికి మందులతో మాత్రమే కాదు, సరైన జీవనశైలి ద్వారా కూడా దీనిని చాలా వరకు నియంత్రించవచ్చు.
ఇది కూడా చదవండి..మధుమేహం ఉన్నవాళ్లు బంగాళదుంపలు ఎందుకు తీసుకోకూడదు..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గితే ప్రాణాలకు ఎందుకు ప్రమాదం..?
ఇది కూడా చదవండి..Diabetic : డయాబెటిక్ రోగులు ఎలాంటి పండ్లకు దూరంగా ఉండాలి..?
అధిక రక్తపోటు..ను హై బ్లడ్ ప్రెషర్.. అని హైపర్‌టెన్షన్ అని కూడా అంటారు. ఈ సమస్య వచ్చిందంటే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధిత రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి..? ఏం చేస్తే అటువంటి సమస్య నుంచి బయట పడొచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా వంటి ట్రాన్స్ క్రొవ్వు పదార్థాలను పూర్తిగా మానెయ్యాలి.
శరీర బరువును తగ్గించుకోవాలి. శరీరానికి ఒత్తిడి, తోపాటు అనవసరంగా ఆందోళన చెందకుండా ఉండాలి.
-పలురకాల అలవాట్లను మార్చుకోవడం ద్వారా హైపర్‌టెన్షన్‌ను సమస్యను నియంత్రించవచ్చు.
-వంటల తయారీలో నూనెలు, కొవ్వు పదార్థాల వినియోగం తగ్గించాలి.
మసాలాలు, కారం కూడా తక్కువగా తినాలి.
-ఉప్ప వినియోగం చాలా తగ్గించాలి.
-పొగతాగడం, మద్యం సేవించడం మానుకోవాలి.
- ప్రతినిత్యం అర్థగంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి.
- అంతేకాదు నిల్వ పచ్చళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి.
ఇది కూడా చదవండి..మధుమేహం ఉన్నవాళ్లు బంగాళదుంపలు ఎందుకు తీసుకోకూడదు..?
ఇది కూడా చదవండి..Healthy walking : వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అంటే..?
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
