మధుమేహం ఉన్నవాళ్లు బంగాళదుంపలు ఎందుకు తీసుకోకూడదు..?
సాక్షి లైఫ్ : కొన్నిరకాల వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా పలురకాల జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వారు తీసుకునే ఆహారపదార్థాల విషయంలో ఖచ్చితంగా నియమాలు పాటించాలి. మధుమేహ సమస్య ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేకరకాల దుష్ప్రభావాలు కలుగుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారట. కారణమేమిటంటే..? బంగాళాదుంప లో ఉండే అధిక కేలరీల కంటెంట్ ఊబకాయ సమస్యకు దారితీస్తుంది.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, బంగాళాదుంప తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అదనంగా బంగాళ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి గ్లూకోజ్ స్థాయిలను తగ్గించు కోవాలను కునేవారు దీనిని తినకపోవడం మేలు. బంగాళదుంపలు అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది.
బంగాళాదుంపలు ఎక్కువగా తింటే రక్తపోటు సమస్య తలెత్తే ప్రమాదం ఉందట. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి కాల్చిన, లేదా ఉడకబెట్టిన బంగాళాదుంపలు వారానికి నాలుగు సార్లు కంటే ఎక్కువగా తినకూడదని పరిశోధకులు చెబుతున్నారు.
బంగాళాదుంప గ్యాస్ సమస్యలను పెంచుతుందట. అంతేకాకుండా ఈ దుంపలు తింటే ఉబ్బరం, అపానవాయువు సమస్యకు గణనీయంగా దోహదం చేస్తాయని రీసెర్చ్ లో తేలింది. మీరు తరచుగా గ్యాస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే, బంగాళాదుంపల వినియోగాన్ని తగ్గించడం లేదా ప్రత్యామ్నాయ ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లు..
ఇది కూడా చదవండి..20 ఏళ్లలోపు వారికే గుండెపోటు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు..
ఇది కూడా చదవండి..బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
