Diabetic : డయాబెటిక్ రోగులు ఎలాంటి పండ్లకు దూరంగా ఉండాలి..?
సాక్షి లైఫ్ : మధుమేహ వ్యాధిని పూర్తిగా నయం చేయలేకపోయినా, సరైన ఆహార నియమాలు, జీవనశైలి మార్పులతో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిక్ రోగులు మిఠాయిలకు దూరంగా ఉండాలని, తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అయితే, కొన్ని పండ్లు చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయని, వీటిని తినేటప్పుడు జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసు కుందాం..!
ఇది కూడా చదవండి..మధుమేహం ఉన్నవాళ్లు బంగాళదుంపలు ఎందుకు తీసుకోకూడదు..?
ఇది కూడా చదవండి..Healthy walking : వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అంటే..?
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
అరటిపండు..
పండిన అరటిపండ్లు డయాబెటిక్ ఉన్నవారు తీసుకోకపోవడమే ఉత్తమం. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ కావడంతో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. కాబట్టి, ఈ పండును తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
మామిడి..
మామిడి పండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కానీ డయాబెటిక్ రోగులు దీనికి దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు అంటున్నారు. ఈ పండులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. తప్పనిసరిగా తినాలనిపిస్తే, చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
పైనాపిల్..
పైనాపిల్‌లో సహజ చక్కెరతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి డయాబెటిక్ ఉన్నవారికి ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే ఈ పండును తక్కువగా మాత్రమే తినాలి.
ద్రాక్ష..
ద్రాక్షలో పోషకాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ, డయాబెటిక్ రోగులు వీటిని ఎక్కువగా తినకూడదు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 46-53 మధ్య ఉంటుంది, దీంతో షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. అప్పుడప్పుడు తక్కువ మోతాదులో తీసుకోవడం సురక్షితం.
పుచ్చకాయ..
వేసవిలో ఎక్కువగా ఇష్టపడే పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువే కానీ, దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక చక్కెర కంటెంట్ వల్ల డయాబెటిక్ రోగులకు హాని కలిగించవచ్చు. కాబట్టి, దీన్ని తక్కువగా తినడమే ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నారు.
లిచీ..
లిచీ పండులో చక్కెర శాతం చాలా ఎక్కువ. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్‌ను వేగంగా పెంచుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు ఈ పండుకు పూర్తిగా దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వైద్యనిపుణులు ఏమంటున్నారంటే..?
డయాబెటిక్ రోగులు పండ్లు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గితే ప్రాణాలకు ఎందుకు ప్రమాదం..?
ఇది కూడా చదవండి..గట్ హెల్త్ ను కాపాడడంలో ఏమేం అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి..?
ఇది కూడా చదవండి..Kids health : పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ ఎందుకు ప్రాణాంతకం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
