డెంగ్యూ ఫీవర్ నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
సాక్షి లైఫ్ : ఒక్కోసారి డెంగ్యూ ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. అటువంటి పరిస్థితుల్లో డెంగ్యూ నివారణతో పాటు డెంగ్యూ లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం ఎంతైనా అవసరం. డెంగ్యూ ఏ వయసు వారికైనా రావచ్చు. అయితే ఈ వ్యాధి పిల్లలను మరింత వేగంగా ప్రభావితం చేస్తుంది. డెంగ్యూ వచ్చిన సమయంలో కొందరికి ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. దీని కారణంగా వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది.
ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ కోసం 5 సోడియం తక్కువగా కలిగిన ఆహారాలు..
ఇది కూడా చదవండి..సమ్మర్ అలర్ట్ : వేసవిలో ఏ రకమైన ఆహారాలకు దూరంగా ఉండాలి..?
ఇది కూడా చదవండి..కీమోథెరపీ వల్ల వచ్చే రక్తహీనతకు అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఔషధం..
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో బ్యాక్టీరియా,వైరల్ ఇన్‌ఫెక్షన్‌లతో పాటు అనేక దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. తీవ్రమైన వ్యాధులలో ఒకటి డెంగ్యూ. దీని కారణంగా దాదాపు ప్రతి ఆసుపత్రిలో రోగుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
డెంగ్యూ లక్షణాలు సాధారణంగా 2 నుంచి 7 రోజుల వరకు ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్తుంటారు. పార్కులు మొదలైన వాటిలో గడ్డిలో తిరుగుతారు. అలాంటి పరిస్థితిలో పిల్లలు డెంగ్యూ బారిన పడే ప్రమాదం ఉంది. పిల్లలలో డెంగ్యూ లక్షణాలను గుర్తించడం ద్వారా, సకాలంలో చికిత్స చేయవచ్చు. పిల్లల్లో డెంగ్యూ లక్షణాలు తెలుసుకోండి.
పిల్లలలో డెంగ్యూ లక్షణాలు..
-పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో డెంగ్యూ లక్షణాలు స్వల్పంగా కనిపిస్తాయి.
శిశువులు, పిల్లలలో డెంగ్యూ లక్షణాలు వైరల్ ఫ్లూ మాదిరిగా ఉంటాయి.
-పిల్లలకు జ్వరం ఒక వారం పాటు ఉండవచ్చు.
డెంగ్యూ వల్ల పిల్లల్లో చిరాకు, నీరసం, చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తస్రావం రావడం జరుగుతుంది. చర్మంపై దద్దుర్లు ,వాంతులు రోజుకు మూడు సార్లు కంటే ఎక్కువగా ఉంటాయి.
-డెంగ్యూలో పిల్లలు కొంత కాలం పాటు తీవ్ర జ్వరంతో బాధపడవచ్చు.
- పెద్ద పిల్లలు కంటి నొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి తలెత్తవచ్చు.
డెంగ్యూ ..
- చిన్నారుల విషయంలో డెంగ్యూ జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
-డెంగ్యూ , చికున్‌గున్యా లక్షణాలు ఒకేలా ఉంటాయి కాబట్టి డెంగ్యూని గుర్తించడానికి రక్త పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
-డెంగ్యూ కారణంగా ప్లేట్‌లెట్స్ లెవల్స్ తగ్గి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది.
-వర్షాకాలంలో పిల్లలకు చేతులు,కాళ్లు కనిపించకుండా దుస్తులు ధరించేలా చేయండి.
-ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దోమల నివారణ చర్యలు చేపట్టాలి.
-సాయంత్రం సమయంలో కిటికీలు, తలుపులు మూసి ఉంచండి.
-ఇంట్లో నీటిని నిల్వ ఉంచవద్దు. ఎందుకంటే అలాంటి చోటే దోమలు ఎక్కువగా జీవిస్తాయి. కాబట్టి అలా రాకుండా ఉండడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
