రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఏమి చేయాలి..?
సాక్షి లైఫ్ : రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మధుమేహ సమస్య ఉన్న వారిలో ఇది మరింత ప్రధానమైనది. రక్తంలో చక్కెర స్థాయిలను సక్రమంగా ఉంచేందుకు ఏమేం చేయాలి..? ఏమేం చేయకూడదు..? అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. పియర్స్ ఫ్రూట్ తినడం ద్వారా షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవడం తోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.. అవేంటంటే..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
రోగనిరోధక శక్తి..
పియర్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది గుండె జబ్బులు,టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
గుండె ఆరోగ్యానికి మేలు..
ప్రోసైనిడిన్ యాంటీఆక్సిడెంట్ పియర్స్ లో సమృద్ధిగా ఉంటుంది, ఇది గుండె కండరాల దృఢత్వాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది రక్తపోటును నిర్వహించడంలోనూ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణశక్తి..
పీచు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పియర్స్ ఫ్రూట్ ను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యాన్సర్ నివారణ..
పియర్స్‌లో ఉండే ఆంథోసైనిన్, క్లోరోజెనిక్ కంటెంట్ క్యాన్సర్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా పీయర్ ఫ్రూట్ తినడం వల్ల ఊపిరితిత్తులు, కడుపు వంటి కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
డయాబెటిస్..
పియర్స్ లో యాంటీ డయాబెటీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఆంథోసైనిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతాయి.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
