ఎలాంటి పిల్లలకు డయాబెటీస్‌ వచ్చే ప్రమాదం ఉంది..?

షేర్ చేయండి:
ఎలాంటి పిల్లలకు డయాబెటీస్‌ వచ్చే ప్రమాదం ఉంది..?

సాక్షి లైఫ్ : పిల్లల్లో టైప్‌-2 మధుమేహానికి వంశపారంపర్య లక్షణాల కంటే ఈ కాలపు జీవనశైలే ఎక్కువ కారణమవుతోందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.  పిల్లలు ఇప్పుడు బయట ఆహారం ఎక్కువగా తింటున్నారు, పాఠశాలల్లో సైతం ఇంట్లోంచి భోజనం తినడం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇది కూడా డయాబెటీస్ కు ఒక కారణమని అంటున్నారు వారు. 

  ఒత్తిడి ప్రభావం.. 

రకరకాల ఒత్తిళ్ల కారణంగా ఈ కాలపు తల్లిదండ్రులు వండిన ఆహారానికి బదులు డబ్బులిచ్చి బయట తినమని పిల్లలకు చెబుతున్నారు. పైగా అన్ని రంగాల్లోనూ బాగా రాణించాలన్న ఒత్తిడి కూడా పిల్లలపై పెంచుతున్నారు. చిన్నప్పటి నుంచే వైద్యం, లేదా ఇంజినీరింగ్‌ చదవాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ పిల్లల్లో మానసిక ఒత్తిడిని పెంచేస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి.. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే టాప్ ఫుడ్స్ ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ సమస్యలకు సరైన పరిష్కారాలు..

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గతంలో ఈ ఒత్తిడి అనేది పదవ తరగతి పూర్తయిన తరువాతే కనిపించేదని, కానీ ఇప్పుడు నాలుగైదు తరగతుల విద్యార్థుల్లోనూ కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. " కుటుంబంలో ఎవరికీ డయాబెటిస్‌ లేకున్నా,.. పిల్లల్లో ఈ వ్యాధి కనిపిస్తోందని, 17 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులను ప్రభావితం చేస్తుంది" అని పరిశోధకులు చెబుతున్నారు.
 
ప్రీ-డయాబెటిస్.. 

ప్రొఫెసర్ వర్మ మాట్లాడుతూ.. “ ICMR డేటా ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని జనాభాలో వయస్సుతో సంబంధం లేకుండా 18 శాతం మందికి మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ICMR అధ్యయనం ప్రకారం, వారు ప్రీ-డయాబెటిస్ విభాగంలోకి వస్తారు. వారు ఇప్పటికీ మధుమేహాన్ని నిరోధించగలరు, కానీ వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం.'' రోజూ కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని,ఆహారపు అలవాట్లను సమీక్షించుకుని శరీరానికి ఏది సరిపోతుందో అదే తినాలని ఆయన సూచించారు.

 

ఇది కూడా చదవండి..మానసిక ప్రశాంతతనిచ్చే సంగీతం..

 ఇది కూడా చదవండి..పిల్లల్లో ఏకాగ్రతను పెంచే యోగాసనాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.