సంతానోత్పత్తిని పెంచే సరైన ఆహారం ఇది..
సాక్షి లైఫ్ : ఇటీవల మహిళల్లో సంతానలేమి సమస్యలు ఎదుర్కొంటు న్నారు. కొన్ని ఆహారాలు సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడ తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. వీటిని తినడం వల్ల సంతానోత్పత్తి కలిగే అవకాశం ఉందని వారు అంటున్నారు..మారిన ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా జనాల్లో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నేటితరం యువతలో ఆయా ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
-శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం, జీవనశైలి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం కూడా సంతానోత్పత్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అవసరమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
-శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
ఆకు కూరలు తినడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.
-రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, విటమిన్ "సి" సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
శరీరంలో పోషకాల కొరత సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మహిళలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానోత్పత్తిని మెరుగుపరిచే సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకు కూరలు.
ఆకు కూరలు తినడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. సంతానోత్పత్తి స్థాయిని పెంచడానికి, మహిళలు తమ ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ "బి", ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్త్రీల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.
బీన్స్..
బీన్స్‌లో లీన్ ప్రొటీన్ అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మహిళల సంతానోత్పత్తిని పెంచుతుంది. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
అరటిపండు..
అరటిపండ్లు తినడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది. పొటాషియం ,విటమిన్" B6" ఇందులో తగినంత పరిమాణంలో ఉంటాయి. సంతానోత్పత్తి హార్మోన్లను పెంచడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది.
డ్రై ఫ్రూట్స్..
డ్రై ఫ్రూట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గర్భిణీలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సంతానోత్పత్తిని మెరుగుపడాలంటే ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ తినాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఫ్రూట్స్..
విటమిన్ "సి" పుష్కలంగా ఉండే పండ్లను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
