పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు.. 

షేర్ చేయండి:
పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు.. 

సాక్షి లైఫ్ : 2020 సంవత్సరం నుంచి ప్రపంచం మొత్తం కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఈ వైరస్ 70 కోట్ల మందికి పైగా బాధితులను చేసింది. కరోనావైరస్ తర్వాత, మంకీపాక్స్ కూడా వ్యాప్తి చెబుతోంది. దీని వల్ల వచ్చే రోగుల సంఖ్య కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మంకీపాక్స్ తీవ్రమైన సమస్యగా మిగిలిపోయింది. ఇటీవలి సమాచారం ప్రకారం, భారతదేశంలో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులకు సికింది. కరోనా, మంకీపాక్స్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలోనే కొత్త అంటు వ్యాధి ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. అదే మార్ బర్గ్ వైరస్. 

ఇది కూడా చదవండి.."టీ" తాగడం మానేస్తే రక్తపోటు నుంచి విముక్తి కలుగుతుందా..?

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి "టీ" తాగడం కూడా ఒక కారణమేనా..?

ఇది కూడా చదవండి..ఆయుర్వేదంలో కూరగాయలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు..?

పదకొండు మంది.. 

తూర్పు ఆఫ్రికా దేశం రువాండాలో మార్ బర్గ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది.  ఇప్పటివరకు ఇక్కడ 36 కేసులు నిర్ధారించగా, దీని కారణంగా పదకొండు మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం దేశంలోని 30 జిల్లాల్లో ఏడు జిల్లాల్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వచ్చినవారు కొందరు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, మరికొందరు ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆఫ్రికా దేశాలలో పెరుగుతున్న ఈ ప్రమాదం గురించి ప్రపంచ ఆరోగ్య నిపుణులు అప్రమత్తం చేశారు.


మార్ బర్గ్ వైరస్ రోజురోజుకీ మరింతగా పెరుగుతున్నాయి. ఈ వైరస్ తో  రువాండాలో ఇప్పటికే 11 మంది చనిపోయారు. ఈ విషయాన్ని అక్కడి  ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. తూర్పు ఆఫ్రికా దేశంలో రోగులలో మొదట గుర్తించిన వ్యాప్తికి ప్రధాన కారణాలు తెలుసుకునేపనిలో ఉన్నారు పరిశోధకులు. రువాండా ప్రభుత్వం తాజాగా వెల్లడించిన ఎబోలా వంటి 36 కేసులు ఉన్నాయని ధృవీకరించగా వాటిలో 25 కేసులు మార్ బర్గ్ వైరస్ కేసులు ఉన్నాయి.

రువాండా సెప్టెంబర్ 27న వ్యాప్తిని ప్రకటించింది. కేవలం 24గంటలు  తర్వాత ఆరు మరణాలు సంభవించాయి. ఆరోగ్య సౌకర్యాలలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్న రోగులలో కేసులు వచ్చాయి. ఐతే ఈ  ఇన్ఫెక్షన్ మూలాన్ని గుర్తించడానికి" దర్యాప్తు జరుగుతోందని ఆరోగ్య శాఖా అధికారులు వెల్లడించారు. ఆఫ్రికా దేశంలో ఈ వ్యాధి భయాలను పెంచుతుంది. మార్ బర్గ్ వంటి వైరల్ ఫీవర్ ల వ్యాప్తిని ఆపడానికి రోగులను, వారితో దగ్గరగా ఉన్న వ్యక్తులను వేరుగా ఉంచడం చాలా కీలకమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.