పూణేలో గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతున్నాయి..? కారణాలేంటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పూణేలో గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) ఎక్కువగా పెరగడానికి పలురకాల కారణాలున్నాయి. ఈ వ్యాధి ఎప్పుడూ ఎన్నడూలేనంతగా వ్యాప్తి చెందుతోంది. వ్యాధి పెరిగే కొద్దీ అది పక్షవాతానికి కారణమవుతుంది, మొదట కాళ్ళు ప్రభావితమై తరువాత శరీరంలోని మిగిలిన అవయవాలపై ఆ ప్రభావం పడుతుంది. ఈ వ్యాధి అనేక వైరస్ లు కారణం కావచ్చు. 

ఇది ఒక్క మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా జిబిఎస్ కేసుల సంఖ్య గతంలో కంటే దాదాపు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగింది. ప్రతి సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు వరకు వర్షాకాలంలో కొన్ని నెలలలో, ముంబైలో వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తర్వాత కొన్ని జిబిఎస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ ఈసారి ఆ వ్యాప్త మరింతగా కనిపిస్తోంది.

 

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

ఈ వ్యాధి కేసులు అకస్మాత్తుగా పెరగడానికి ఏదైనా ప్రత్యేకమైన వైరస్ కారణమా..?

ప్రస్తుత పెరుగుదలకు పాక్షికంగా నోరోవైరస్ కారణమని నమ్ముతున్నారు. మొదటగా గుర్తించిన కొన్ని కేసులు క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఉనికికి సంబంధించినవి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రధాన కారణం కలుషితమైన నీరు కావచ్చని చెబుతున్నారు.

 

పూణేలో ఈ వ్యాధి ఎందుకు ఎక్కువగా వ్యాపిస్తోంది..?

 ఈ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించే మందులు కొంచెం ఖరీదైనవి. పూణేలో ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు లభించకపోవడమే. అటువంటి పరిస్థితిలో, నీటిలో క్లోరిన్ మాత్రలు వేయమని ప్రజలకు సలహా ఇస్తున్నారు. మ్యుటేషన్ కారణంగా ఈ వైరస్ మహారాష్ట్రకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.