రేబిస్ ఎందుకంత ప్రాణాంతకం అంటే..?

షేర్ చేయండి:
రేబిస్ ఎందుకంత ప్రాణాంతకం అంటే..?

సాక్షి లైఫ్ : సాధారణంగా కనిపించే కుక్క కాటు.. ఒక్కోసారి ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా మారవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమైన "రేబిస్" వ్యాధికి దారి తీస్తుంది. ఈ వ్యాధికి సరైన చికిత్స లేకపోవడంతో, దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం. రేబిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత, అది నాడీ వ్యవస్థ ద్వారా మెదడు ,వెన్నుపాముకు చేరుకుంటుంది. ఈ వైరస్ నాడీ కణాలను దెబ్బతీయడం మొదలుపెడుతుంది.

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

 

రేబిస్ అంటే ఏమిటి..?

రేబిస్ అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది రేబిస్ సోకిన జంతువుల (ముఖ్యంగా కుక్కలు) లాలాజలం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ మెదడు ,నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలైన తర్వాత చికిత్స అందించినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఎలా వ్యాపిస్తుంది..?

పిచ్చి కుక్క కరవడం లేదా గీకడం వల్ల కూడా రేబిస్ వ్యాధి వస్తుంది. రేబిస్ సోకిన జంతువు లాలాజలం గాయాలైన చర్మంపై లేదా కళ్లలో, నోటిలో పడటం.

రేబిస్ లక్షణాలు ఎలా ఉంటాయి..?   

రేబిస్ వైరస్ సోకిన వెంటనే లక్షణాలు కనిపించవు. ఇది శరీరంలో కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు నిద్రాణంగా ఉంటుంది. కుక్క కాటు ఉన్న ప్రాంతాన్ని బట్టి లక్షణాలు త్వరగా లేదా ఆలస్యంగా బయటపడవచ్చు.

ప్రారంభ లక్షణాలు..?  

జ్వరం, తలనొప్పి.

ఒళ్లు నొప్పులు, అలసట.

గాయం అయిన చోట మంట లేదా తిమ్మిరి.

వ్యాధి ముదిరిన తర్వాత కనిపించే లక్షణాలు.. 

తీవ్రమైన ఆందోళన, గందరగోళం.

నీరు అంటే భయం (హైడ్రోఫోబియా).

గొంతులో బిగుతు అనిపించడం, మింగడంలో ఇబ్బంది.

ఎక్కువగా లాలాజలం కారడం.

కోపం, దూకుడు ప్రవర్తన.

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.