ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ఎందుకు వాడాలి..? నిపుణులు ఏం చెబుతున్నారు..? 

షేర్ చేయండి:
ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ఎందుకు వాడాలి..? నిపుణులు ఏం చెబుతున్నారు..? 

సాక్షి లైఫ్ : సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత (యూవీ) కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. ఇవి ముడతలు, వయసు మచ్చలు, చర్మ క్యాన్సర్ వంటి సమస్యలకు కారణమవుతాయి. ఆకాశం మేఘావృతంగా ఉన్నా, ఇంటి లోపల ఉన్నా, కిటికీల గుండా యూవీ కిరణాలు చర్మాన్ని చేరుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల నుంచి వెలువడే నీలి కాంతి (బ్లూ లైట్) కూడా చర్మాన్ని దెబ్బతీస్తుంది.

 

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?

 

సూర్యరశ్మి లేనప్పటికీ ప్రతిరోజూ సన్‌స్క్రీన్ వాడటం చర్మ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని చర్మవ్యాధి నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉన్నా, బయట తిరిగినా, సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా అప్లై చేయాలని వారు సిఫార్సు చేస్తున్నారు. 

ఎలా రక్షణ పొందాలి..?

- సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎస్. పి.ఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి.
- ఉదయం, సాయంత్రం రెండు సార్లు సన్‌స్క్రీన్ అప్లై చేయండి.
- ఇంట్లో ఉన్నప్పుడు కూడా రెండు గంటలకోసారి సన్‌స్క్రీన్‌ను రీ-అప్లై చేయాలి.
- బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ ఉపయోగించడం ద్వారా యూవీ కిరణాల నుంచి రక్షణ పొందవచ్చు.

సన్‌స్క్రీన్ అనేది కేవలం వేసవి కాలంలోనే కాదు, ఏడాది పొడవునా చర్మ రక్షణకు అవసరం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుంది," అని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు.

చర్మ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారు నిత్యం సన్‌స్క్రీన్‌ను తమ రొటీన్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.  

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.