Reduce Cholesterol Naturally : చలికాలంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే చిట్కాలు.. 

షేర్ చేయండి:
Reduce Cholesterol Naturally : చలికాలంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే చిట్కాలు.. 

సాక్షి లైఫ్ : శరీరంలో అధిక స్థాయిలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు బ్యాడ్ కొలెస్ట్రాల్ శరీరం మొత్తానికే హానికరం. ముఖ్యంగా చలికాలంలో హై కొలెస్ట్రాల్ పలు రుగ్మతలకు కారణమవుతుంది. మందులతో పనిలేకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి..అవేంటంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

 

మందులు లేకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించే మార్గాలు.. 


ప్రస్తుతం బిజీ జీవనశైలితోపాటు, అసమతుల్య ఆహారం కారణంగా, అధిక కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్‌గా మారి పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా, LDL చెడు కొలెస్ట్రాల్ రక్త నాళాలలో పేరుకుపోయినప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది. ఇది అడ్డంకులను కలిగిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

 చిన్న జీవనశైలి మార్పులు చేయడం ద్వారా కేవలం ఒక నెలలోనే చెడు కొలెస్ట్రాల్‌ను 30శాతం నుంచి 50శాతం వరకు ఎలా తగ్గించవచ్చని  వైద్యనిపుణులు అంటున్నారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన ఆహారం,శారీరక శ్రమకు సంబంధించింది. వాటిని సరిగ్గా నిర్వహించడం ద్వారా, మనం గుండె జబ్బుల నుంచి సురక్షితంగా బయట పడవచ్చు.

 
శుద్ధి చేసిన నూనె వద్దే వద్దు..  

శుద్ధి చేసిన నూనెను తీసుకోవడం  పూర్తిగా మానేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. శుద్ధి చేసిన నూనె తయారీ ప్రక్రియలో అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రాసెస్ చేస్తారు, ఇది ధమనులలో వాపు, కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇలాంటి వాటికి బదులుగా, కోల్డ్-ప్రెస్డ్ వేరుశెనగ నూనె లేదా ఆలివ్ నూనెను ఉపయోగించడం మంచిది. ఈ 'కోల్డ్-ప్రెస్డ్' నూనెలు సహజ పోషకాలతో కూడి ఉంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో సహాయపడతాయి.

ఫైబర్,నట్స్.. 

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, ప్రతిరోజూ ఓట్స్, అవిసె గింజలు లేదా చియా గింజలు వంటివి 2 టీస్పూన్ల వరకూ తీసుకోవాలి. ఈ ఫైబర్‌లు శరీరంలో స్పాంజ్ లాగా పనిచేస్తాయి, చెడు కొలెస్ట్రాల్‌ను గ్రహించి, తొలగిస్తాయి. అంతేకాకుండా ప్రతిరోజూ 20-30 గ్రాముల బాదం, వాల్‌నట్‌లను తినాలి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా అంతర్గత ఇన్ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తాయి.

రోజువారీ 7,000 నుంచి 10,000 అడుగులు నడవాలి..

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆహారం మాత్రమే కాదు, శారీరక శ్రమ కూడా అవసరం. ప్రతిరోజూ 7,000 నుంచి 10,000 అడుగులు నడవాలని, నడక  శరీరంలోని జీవక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా మారుస్తుంది. ఈ సాధారణ వ్యాయామం సిరల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి,గుండె కండరాలను బలపరుస్తుంది.

 సమతుల్య ఆహారం..

 ఆహారంలో కూరగాయల పరిమాణాన్ని పెంచడం కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడానికి సులభమైన మార్గం. పగటి భోజనం, రాత్రి భోజనంలో ఉడికించిన లేదా తేలికగా ఉడికించిన కూరగాయలను చేర్చుకోండి. కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తాయి.

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.