Essential Medical Tests Every Woman : వయసు పెరిగే కొద్దీ మహిళలకు ఏ వయసులో ఏ పరీక్షలు అవసరమో తెలుసా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. కానీ, ఆధునిక జీవనశైలిలో కుటుంబ బాధ్యతల్లో పడి మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సర్వసాధారణం అయిపోయింది. వయసు పెరిగే కొద్దీ మహిళల శరీరంలో హార్మోన్ల మార్పులతో పాటు జీవక్రియల (Metabolism) వేగం కూడా మారుతుంటుంది. 30లలో నెమ్మదించే జీవక్రియలు, 40లలో వచ్చే శారీరక మార్పులు, 50 దాటాక ఎదురయ్యే మేనోపాజ్ (menopause) సమస్యలు.. ఇలా ప్రతి దశలోనూ మహిళల శరీరం ప్రత్యేక శ్రద్ధను కోరుకుంటుంది. కేవలం మంచి ఆహారం, వ్యాయామం మాత్రమే కాకుండా, ముందస్తు ఆరోగ్య పరీక్షలు (Preventive Health Check-ups) చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద ముప్పులను ప్రారంభ దశలోనే అడ్డుకోవచ్చు. మరి 30, 40, 50 ఏళ్ల వయసులో మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ఆ పరీక్షలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

 

30లలో అడుగుపెట్టాక.. (Age 30+)..  

ఈ వయసులో కెరీర్, కుటుంబ బాధ్యతల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జీవక్రియలు నెమ్మదించడం ఇప్పుడే మొదలవుతుంది. కాబట్టి ఈ కింది పరీక్షలు అవసరం. రక్తపోటు (BP Check).. అధిక రక్తపోటు (Hyper tension) సైలెంట్ కిల్లర్‌లా మారుతుంది. అందుకే ఏడాదికి ఒక్కసారైనా బీపీ తనిఖీ ముఖ్యం.మధుమేహ పరీక్షలు (Sugar Tests)..డయాబెటిస్ ముప్పును అంచనా వేయడానికి 'ఫాస్టింగ్ బ్లడ్ షుగర్' లేదా మూడు నెలల సగటును తెలిపే HbA1c పరీక్ష చేయించుకోవాలి.

థైరాయిడ్ ప్రొఫైల్ (TSH)..మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులకు, బరువు పెరగడానికి, అలసటకు థైరాయిడ్ ప్రధాన కారణం. అందుకే TSH పరీక్ష అవసరం.సిబిసి, ఐరన్ ప్రొఫైల్ (CBC & Iron)..భారతదేశంలో చాలామంది మహిళలు రక్తహీనత (Anemia)తో బాధపడుతుంటారు. దీని తీవ్రతను తెలుసుకోవడానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అవసరం. పాప్ స్మియర్ (Pap Smear).. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer)ను ప్రాథమిక దశలోనే గుర్తించడానికి 30 దాటిన ప్రతి మహిళా వైద్యుల సలహా మేరకు ఈ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

40ల మైలురాయి దాటిన తర్వాత.. (Age 40+)..

నలభై ఏళ్ల వయసులో జీవనశైలి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ దశలో క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన స్క్రీనింగ్‌లు..మామోగ్రామ్ (Mammography).. రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) ముందస్తు గుర్తింపు కోసం 40 ఏళ్లు దాటిన మహిళలు వైద్యుల పర్యవేక్షణలో క్రమబద్ధంగా మామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ (Lipid Profile)..రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని, గుండె జబ్బుల ముప్పును అంచనా వేయడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది. లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్స్ (LFT & KFT)..శరీరంలోని ముఖ్య అవయవాలైన కాలేయం, మూత్రపిండాల పనితీరును తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. విటమిన్ డి3, బి12 (Vitamins D3 & B12)..ఎముకల బలహీనత, తీవ్రమైన నీరసం రాకుండా ఉండాలంటే ఈ విటమిన్ల స్థాయిలను తనిఖీ చేసుకోవాలి. కంటి పరీక్షలు..గ్లాకోమా (కంటి ఒత్తిడి), దృష్టి లోపాలను గుర్తించడానికి నేత్ర పరీక్షలు అవసరం.

50ల వసంతంలో.. (Age 50+)..

ఈ వయసులో చాలామంది మహిళలు మేనోపాజ్ (నెలసరి ఆగడం) దశకు చేరుకుంటారు. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపం వల్ల ఎముకలు, గుండెపై ప్రభావం పడుతుంది.

బోన్ డెన్సిటీ టెస్ట్ (DEXA Scan).. ఎముకలు గుల్లబారే వ్యాధి (Osteoporosis) ప్రమాదాన్ని, ఎముకల సాంద్రతను తెలుసుకోవడానికి డెక్సా స్కాన్ తప్పనిసరి.

కడుపు, ప్రేగుల పరీక్షలు (Colonoscopy)..పెద్దప్రేగు క్యాన్సర్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించడానికి వైద్యుల సిఫార్సు మేరకు కొలొనోస్కోపీ చేయించుకోవాలి.

కార్డియాక్ అసెస్‌మెంట్ (Cardiac Check)..గుండె పనితీరును మెరుగ్గా ఉంచుకోవడానికి ఈసీజీ (ECG), ఎకో (Echo) వంటి ప్రాథమిక గుండె పరీక్షలు అవసరం.

దంత, కంటి సంరక్షణ..వయసుతో పాటు వచ్చే చిగుళ్ల సమస్యలు, కంటి శుక్లాల (Cataracts) నివారణకు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. వ్యాధి వచ్చాక బాధపడటం కంటే.. రాకుండా ముందుగానే అప్రమత్తం కావడం (Prevention is better than cure) ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఏడాదికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అలవాటును మీ జీవనశైలిలో భాగం చేసుకోండి.

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.