World Brain Tumor Day 2025: భారతదేశంలో బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరగడానికి కారణాలు..? 

షేర్ చేయండి:
World Brain Tumor Day 2025: భారతదేశంలో బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరగడానికి కారణాలు..? 

సాక్షి లైఫ్ : ప్రతి ఏటా భారతదేశంలో బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరుగు తున్నాయి. ఈ కేసులు పెరగడానికి జన్యువులు, రేడియేషన్, అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు, అరుదైన సందర్భాల్లో కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు వంటివి కారణమవుతున్నాయని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చు, అయితే ఆయా లక్షణాల్లో తలనొప్పి, కంటి సంబంధిత సమస్యలు, వికారం, మూర్ఛలు, సమతుల్యత కోల్పోవడం, జ్ఞాపకశక్తి సమస్యలు ఉండవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..30 నిమిషాల్లో 10 రెట్లు ఆరోగ్యప్రయోజనాలిచ్చే 'జపనీస్ వాకింగ్' టెక్నిక్..!

ఇది కూడా చదవండి..శిశువుల్లో బ్రాంకైటిస్‌ ను నిర్మూలించే సరికొత్త ఔషధం.. 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 

 

"బ్రెయిన్ ట్యూమర్‌లు ఎప్పుడూ ఒకే స్పష్టమైన కారణం వల్ల సంభవించవు" అని చెబుతున్నారు వైద్యనిపుణులు. "కానీ ఆహారం, నిద్ర, వ్యాయామం,ఒత్తిడి నిర్వహణ ద్వారా మెదడు ఆరోగ్యంపెద్ద పాత్ర పోషిస్తుందని వారు అంటున్నారు.

 జూన్ 8వతేదీన ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా మెదడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, చిన్న మార్పులతో  మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని పిలుపునిచ్చారు.

ప్రతి సంవత్సరం 28వేల మందికి పైగా భారతీయులు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారని ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూరాలజీ (2025) వెల్లడించింది. కొన్ని బ్రెయిన్ ట్యూమర్‌లు క్యాన్సర్ కారకమైనప్పటికీ, చాలావరకు క్యాన్సర్ కానివి (benign) అయినప్పటికీ, వాటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.