World Diabetes Day 2025 : భయాబేటిస్.. కాదు డయాబేటిస్.. నిజాలు తెలుసుకోండి..  

సాక్షి లైఫ్ : భయాబేటిస్.. కాదు డయాబేటిస్ అవును.. చాలామంది డయాబెటీస్ అనగానే భయబ్రాంతులకు గురవుతూ ఉంటారు. అయితే ఈ వ్యాధి గురించి అంతగా భయపడాల్సిన పనిలేదని, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అదేమీ పెద్ద సమస్య కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం (Diabetes) విషయంలో ప్రజల్లో ఎన్నో అపోహలు, అపార్థాలు ఉన్నాయి. వీటి కారణంగా సరైన చికిత్స తీసుకోకపోవడం, అనవసరమైన భయంతో జీవించడం జరుగుతోంది.

 

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

 

మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం (World Diabetes Day) నిర్వహిస్తారు. ప్రజల్లో నాటుకుపోయిన కొన్ని ముఖ్యమైన అపోహలు, వాటి వెనుక ఉన్న వాస్తవాలు తెలియ జేయడానికి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు.. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..   

అపోహ (Myth)వాస్తవం (Fact)అపోహ : 1..  

చక్కెర ఎక్కువగా తింటేనే డయాబెటిస్ వస్తుంది. వాస్తవం: డయాబెటిస్ రావడానికి కేవలం చక్కెర మాత్రమే కారణం కాదు. అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి, వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన అంశాలు, వయస్సు దీనికి ప్రధాన కారణాలు.

అపోహ 2 : డయాబెటిస్ ఉన్నవారు తీపి పదార్థాలు, పండ్లు అసలు తినకూడదు..

వాస్తవం ఏమిటంటే..?.. పండ్లు, తీపి పదార్థాలు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మోతాదు, సమయం ముఖ్యం. పండ్లలో సహజ చక్కెరలతో పాటు ఫైబర్, విటమిన్లు ఉంటాయి. వైద్యుల సలహా మేరకు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పండ్లను తగిన మోతాదులో తీసుకోవచ్చు.


అపోహ 3: టైప్-2 డయాబెటిస్ కేవలం పెద్దవాళ్లకే వస్తుంది..

వాస్తవం ఏమిటంటే..?.. ఇది ఒకప్పుడు నిజం. కానీ, మారుతున్న జీవనశైలి, ఊబకాయం కారణంగా ఇప్పుడు పిల్లలు, టీనేజర్లలో కూడా టైప్-2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలి అందరికీ అవసరం.

అపోహ 4: ఇన్సులిన్ తీసుకుంటే.. అది బాగవ్వని వ్యాధికి చివరి దశ చికిత్స..

వాస్తవం ఏమిటంటే..?.. ఇన్సులిన్ అనేది జీవితాన్ని కాపాడే ఒక హార్మోన్. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు, అలాగే కొన్నిసార్లు టైప్-2 మధుమేహులు కూడా, క్లిష్టమైన సమస్యలు రాకుండా నివారించడానికి డాక్టర్ల సలహా మేరకు ఇన్సులిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది చికిత్సలో ఒక భాగం మాత్రమే.

అపోహ 5: మధుమేహం వస్తే కళ్లు పోతాయి, కాళ్లు తీసేయాల్సి వస్తుంది..

వాస్తవం ఏమిటంటే..?.. చికిత్స తీసుకోకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోకపోతేనే ఈ తీవ్రమైన సమస్యలు అంటే అంధత్వం, పాదం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మధుమేహాన్ని సకాలంలో గుర్తించి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తే, ఆరోగ్యంగా సాధారణ జీవితం గడపవచ్చు.

అపోహ 6: డయాబెటిక్ ఫుడ్ మాత్రమే తినాలి..

 వాస్తవం ఏమిటంటే..?.. 'డయాబెటిక్' అని లేబుల్ చేసిన ఆహారాల్లో సాధారణ చక్కెరలకు బదులు కృత్రిమ స్వీటెనర్లను వాడుతారు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ పెరిగే అవకాశం ఉంది. సహజమైన, సమతుల్యమైన ఆహారం తీసుకోవడమే ఉత్తమ మార్గం.

 మధుమేహం నిర్వహణకు కీలక సూచనలు.. రెగ్యులర్ చెకప్, రక్తంలో చక్కెర (Fasting, PP, HbA1c) పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలి. 

ఆహార నియంత్రణ..  

అధిక పీచు పదార్థాలు అంటే ఫైబర్ ఉన్న ఆహారం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాలు తగ్గించండి. 

వ్యాయామం.. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయండి. మందులు లేదా ఇన్సులిన్ మోతాదు విషయంలో ఎప్పుడూ వైద్యుడి సలహాలు పాటించాలి. సొంత చికిత్సలు చేయవద్దు, అపోహలు నమ్మవద్దు. మధుమేహం అనేది ఒక సమస్యే కానీ, అదే మీ జీవితాన్ని శాసించే వ్యాధి కాదు. అవగాహన పెంచుకొని, అపోహలను తొలగించుకుంటే, డయాబెటిస్‌ ను మ్యానేజ్ చేస్తూ సంతోషంగా జీవించవచ్చు.- పసుపులేటి. వెంకటేశ్వరరావు.. 

 

 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : how-to-beat-diabetes what-is-prediabetes what-is-pre-diabetes what-is-diabetes reversing-prediabetes prediabetes-treatment reverse-prediabetes reverse-diabetes world-diabetes-day-2025
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com