వరల్డ్ మలేరియా డే 2025: పిల్లలను మలేరియా నుంచి కాపాడే 5 కీలక చిట్కాలు
సాక్షి లైఫ్ : ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం (World Malaria Day) జరుపుకుంటారు. ఈ రోజు మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. మలేరియా అనేది ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది, ఇది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల సంక్రమిస్తుంది. పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా, తల్లిదండ్రులు తమ పిల్లలను మలేరియా నుంచి కాపాడేందుకు అవసరమైన 5 చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
పిల్లలను మలేరియా నుంచి కాపాడే 5 చిట్కాలు..
మస్కిటో నెట్‌ల వినియోగం..
రాత్రి పూట పిల్లలు నిద్రించే సమయంలో మస్కిటో నెట్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇవి దోమ కాటు నుంచి సమర్థవంతంగా రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా శిశువులు, చిన్న పిల్లల కోసం రసాయనాలు లేని, సురక్షితమైన నెట్‌లను ఎంచుకోవాలి.
దోమల నివారణ క్రీమ్‌లు..
పిల్లల చర్మంపై దోమలను తరిమికొట్టే క్రీమ్‌లు లేదా స్ప్రేలను రాయడం వల్ల దోమ కాటు నుంచి రక్షణ లభిస్తుంది. కానీ ఇవి పిల్లలకు సురక్షితమైనవని ఏమాత్రం కావు. కాబట్టి వైద్యుల సలహా తీసుకుని మాత్రమే వారు సూచించిన క్రీమ్స్ ఉపయోగించాలి.
పరిసరాల పరిశుభ్రత..
ఇంటి చుట్టూ నీరు నిలవకుండా చూసుకోవాలి. నీటి ట్యాంకులు, కుండీలు, డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. దోమలు నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి కాబట్టి, నీటి నిల్వలను నియంత్రించడం ద్వారా మలేరియా వ్యాప్తిని చాలా వరకూ అరికట్టవచ్చు.
ఇలాంటి దుస్తులు ధరించడం..
సాయంత్రం, రాత్రి సమయాల్లో పిల్లలకు పొడవు చేతుల చొక్కాలు, ప్యాంట్‌లు వంటి దుస్తులు వేయించాలి. ఇలా చేయడం వల్ల దోమ కాటు నుంచి కొంతమేర రక్షణ లభిస్తుంది. లేత రంగు దుస్తులు ధరించడం మరింత మంచిది, ఎందుకంటే దోమలు ముదురు రంగుల వైపు ఎక్కువగా ఆకర్షితమవుతాయి.
వైద్య సలహా ద్వారా..
మలేరియా ఎక్కువగా వ్యాపించే ప్రాంతాలకు పిల్లలను తీసుకెళ్లే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన RTS,S/AS01 మలేరియా వ్యాక్సిన్‌ను పిల్లలకు వేయించడం ద్వారా మలేరియా నుంచి రక్షణ పొందవచ్చు. ఈ వ్యాక్సిన్ ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లలకు రక్షణను అందిస్తుంది.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
