World Oral Health Day 2026 : ఓరల్ హెల్త్  విషయంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..!

షేర్ చేయండి:
World Oral Health Day 2026 : ఓరల్ హెల్త్  విషయంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..!

సాక్షి లైఫ్ : మన శరీర ఆరోగ్యానికి ఓరల్ హెల్త్ ఒక అద్దం వంటిది. నోటిలో కనిపించే చిన్న మార్పులే భవిష్యత్తులో రాబోయే వ్యాధులకు సంకేతాలు కావచ్చు. ఈరోజు 'వరల్డ్ ఓరల్ హెల్త్ డే ' సందర్భంగా  దంతాల ఆరోగ్యంపై దంతవైద్య నిపుణులు అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి..! తీవ్ర వ్యాధులకు ముందస్తు సంకేతాలు.. 

మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, అంతెందుకు ప్రాణాంతక క్యాన్సర్ లక్షణాలు కూడా మొదట నోటిలోనే కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పొగాకు, మద్యం, అధిక చక్కెర తీసుకోవడం వంటి అలవాట్లు కేవలం దంతాలకే కాకుండా మొత్తం శరీరానికే చేటు చేస్తాయి. అందుకే, నోటిలో ఈ క్రింది 9 మార్పులను గమనిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దంతవైద్యుడిని సంప్రదించాలి.

 

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

 

 గమనించాల్సిన సంకేతాలు..  

 నోటిలో ఎర్రటి లేదా తెల్లటి మచ్చలు ఉండి, రెండు వారాలైనా తగ్గకపోతే అది ఇన్ఫెక్షన్ లేదా క్యాన్సర్ కావచ్చు.

చిగుళ్లు, దవడ లేదా గొంతు భాగంలో వాపు కనిపిస్తే అది ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపిస్తోందని అర్థం.

 పెద్దవారిలో శాశ్వత దంతాలు వదులుగా ఉంటే అది చిగుళ్ల వ్యాధికి లేదా ఆస్టియోపొరోసిస్‌కు సంకేతం కావచ్చు.  బ్రష్ చేసేటప్పుడు లేదా ఆహారం తినేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం గమ్ డిసీజ్ (Gingivitis) లక్షణం.  వేడి లేదా చల్లని పదార్థాలు తిన్నప్పుడు పళ్లు తిమ్మిరిగా అనిపిస్తే ఎనామెల్ దెబ్బతిన్నట్లు గుర్తించాలి.పంటి నొప్పి నిరంతరంగా వేధిస్తుంటే దంత క్షయం (Cavities) తీవ్రమైనట్లు అర్థం. బ్రష్ చేసినా నోరు వాసన వస్తున్నా, వింత రుచిగా అనిపిస్తున్నా లోపల ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. నోరు తెరిచినప్పుడు లేదా మూసినప్పుడు దవడల నుంచి శబ్దం వస్తే అది టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ (TMJ) సమస్య కావచ్చు. లాలాజలం తగ్గి నోరు పొడిబారితే బ్యాక్టీరియా పెరిగి దంతాలు త్వరగా పాడైపోతాయి.

దంతాల సంరక్షణకు 5 సూత్రాలు.. 

 స్వీట్లు, చాక్లెట్లకు దూరంగా ఉండండి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోండి. సిగరెట్లు, గుట్కా, తంబాకు వంటి అలవాట్లను పూర్తిగా మానేయండి. రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్‌తో బ్రష్ చేయడం మర్చిపోవద్దు.

ఆటలు ఆడేటప్పుడు దంతాలకు దెబ్బ తగలకుండా మౌత్‌గార్డ్ వాడండి. మద్యపానం నోటి క్యాన్సర్ ముప్పును పెంచుతుంది, దానికి దూరంగా ఉండండి. ఈ లక్షణాలు మీలో ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే దంతవైద్యనిపుణులను కలిసి చికిత్స తీసుకోవడం మంచిది.

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.