వంట నూనెను మళ్లీ మళ్లీ మళ్లీ వాడకూడదా? ఎందుకు..?  

సాక్షి లైఫ్ : వంట నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే వంట కోసం ఎక్కువగా నూనెను ఉపయోగించవద్దని, ముఖ్యంగా ఒకసారి వాడిన వంట నూనెను మళ్లీ ఉపయోగిస్తే అనేక వ్యాధుల బారీన పడాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

ఆహారం రుచి  పెంచేందుకు నూనె అవసరమే కానీ మళ్లీమళ్లీ వాడితే మాత్రం అది ఆరోగ్యానికి హానికరం  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 పెద్ద మొత్తంలో టాక్సిన్స్ విడుదలవుతాయి..

ఒక్కసారి వాడిన నూనెను వంట కోసం తిరిగి ఉపయోగిస్తే.. అధిక సాంద్రత కలిగిన విష రసాయనాలు విడుదలవుతాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి అనేక వ్యాధులు తెచ్చి పెట్టే అవకాశముందని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. 

ప్రోటీన్ల పనితీరుకు ఆటంకం.. 

నూనెను మళ్లీ మళ్లీ వాడినప్పుడు 4-హైడ్రాక్సీ-ట్రాన్స్-2-నామినల్ (HNE) అని పిలిచే మరొక టాక్సిన్ పదార్ధం విడుదలవుతుంది. ఇది మన శరీరంలోని DNA, RNA ప్రోటీన్ల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది.

-తిరిగి ఉపయోగించిన నూనె అధిక ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ల స్థాయికి దారితీస్తుంది.. 

చెడు కొలెస్ట్రాల్.. 
 
వంట నూనెను మళ్లీ ఉపయోగించినప్పుడు, దాని ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్ల స్థాయులు పెరుగుతాయని మీకు తెలుసా..? అవును! ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ,ఛాతీ నొప్పి ప్రమాదాన్ని పెంచే చెడు కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుతుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయులను కూడా తగ్గిస్తుంది. అందువల్ల, కొలెస్ట్రాల్-సంబంధిత రుగ్మతల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వంట నూనెను మళ్లీ ఉపయోగించకుండా ఉండండం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వంటనూనె తయారీ ప్రక్రియలో రసాయనాలను ఉపయోగిస్తారు. అలాంటి నూనె వంట కోసం ఉపయోగించే ప్రతిసారీ దుర్వాసన వస్తుంది. ఆరోగ్యంగా ఉండడం కోసం వంట నూనెలను మరోసారి అస్సలు ఉపయోగించకూడదు.

-క్యాన్సర్ కు దారితీస్తుంది..
 
నూనెల పునర్వినియోగం అనేక సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది, వీటిలో పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు (PAHలు) ఉంటాయి. వీటిలో కొన్ని కారకాలు క్యాన్సర్ ప్రమాదాలను కలిగి ఉంటాయి.  ముఖ్యంగా పెద్దప్రేగు క్యాన్సర్‌ను ప్రేరేపించగల జన్యువులలో ఉత్పరివర్తనలు, మార్పులకు ప్రమాద కారకంగా ఉంటాయి. పదేపదే వేడిచేసిన ఈ నూనెలను తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, కాబట్టి  ఉపయోగించకుండా ఉండటం ఉత్తమం.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.


 

Tags : reused-oil

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com