సన్ ఫ్లవర్ సీడ్స్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?
సాక్షి లైఫ్ : పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్లు B2, B3, B6, C, E అండ్ K వంటి అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా విటమిన్ B-1ను పొందవచ్చు.
విటమిన్ B1 లేదా థయామిన్ అనేది నీటిలో కరిగే విటమిన్, ఇది శరీరం కార్బోహైడ్రేట్‌లను శక్తిగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. విటమిన్ B1 లోపం సాధారణంగా బెరిబెరి వ్యాధికి కారణమవుతుంది. అంతేకాదు నరాల సంబంధిత రుగ్మతలు కూడా పెంచుతుంది.
విటమిన్ B1లోపిస్తే..
ఇది కాకుండా, విటమిన్ B1లోపిస్తే బరువు తగ్గడం, అనోరెక్సియా సమస్య తలెత్తుతుంది. తీవ్రమైన సందర్భాల్లో గందరగోళం, జ్ఞాపకశక్తి సమస్యలు కూడా సంభవించవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
పొద్దుతిరుగుడు గింజల్లో..
ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి1ను పొందవచ్చు. అటువంటి వాటిలో సన్ ఫ్లవర్ సీడ్స్ చాలా ముఖ్యమైనవి. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ బి1 తగినంత మొత్తంలో ఉంటుంది. 100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాలలో 0.106 mg విటమిన్ B1 పొందవచ్చు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
