Hoarse Voice : బొంగురుపోయిన గొంతుకు ఉపశమనం కలిగించే అద్భుత చిట్కాలు..

షేర్ చేయండి:

సాక్షిలైఫ్ : వర్షాకాలంలో చల్లటి గాలులు, తేమ కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఈ వాతావరణంలో చాలా మందిని వేధించే ప్రధాన సమస్య గొంతు నొప్పి, గొంతు బొంగురుపోవడం. చల్లటి పదార్థాలు తినడం, వర్షంలో తడవడం, ఎక్కువగా మాట్లాడటం లేదా ఇన్ఫెక్షన్ల వల్ల గొంతు కూర్చుండిపోతుంది. వెంటనే మందుల వైపు మొగ్గుచూపకుండా, ప్రారంభ దశలో మన వంటగదిలో దొరికే పదార్థాలతోనే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు.

 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..

 

 గొంతు సమస్యలను తగ్గించే 5 సులభమైన చిట్కాలు.. 

గొంతులో మంట, వాపు తగ్గడానికి ఇది అత్యుత్తమమైన పద్ధతి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక అర టీస్పూన్ ఉప్పు కలిపి రోజుకు 2-3 సార్లు పుక్కిలించాలి. దీనివల్ల గొంతులోని బ్యాక్టీరియా నశించి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. తేనె గొంతుకు సాంత్వన చేకూరుస్తుంది. ఒక చెంచా తేనెలో కొద్దిగా అల్లం రసం కలిపి రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవచ్చు. 

గమనిక : ఏడాది లోపు పిల్లలకు తేనె తినిపించకూడదు. తులసి ఆకులు, అల్లం, మిరియాలతో తయారు చేసిన వేడివేడి హెర్బల్ టీ గొంతుకు ఎంతో హాయినిస్తుంది. ఇందులో కాస్త తేనె కలుపుకొని తాగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వేడి నీటితో ఆవిరి పట్టడం వల్ల గొంతు, శ్వాసనాళాల్లో తేమ చేరి పొడిబారడం తగ్గుతుంది. గొంతు మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, ఆవిరి పట్టేటప్పుడు వేడినీరు మీద పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

గొంతు పట్టివేసినప్పుడు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. గోరువెచ్చని నీరు, సూప్‌లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, స్వరపేటికపై (vocal cords) ఒత్తిడి పడకుండా ఉండేందుకు వీలైనంత తక్కువగా మాట్లాడాలి.గొంతు సమస్య ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండాలి.. అతి చల్లని పానీయాలు, ఐస్ క్రీమ్‌లు.ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం.మితిమీరిన కారం, నూనెలో వేయించిన పదార్థాలు.

ఎక్కువగా టీ, కాఫీలు లేదా కెఫిన్ ఉండే పానీయాలు తాగడం. బిగ్గరగా అరవడం, ఎడతెరిపి లేకుండా మాట్లాడటం.వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి.. గొంతు నొప్పి 5 నుంచి 7 రోజుల కంటే ఎక్కువ రోజులు వేధిస్తుంటే.తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.ఆహారం లేదా నీళ్లు మింగేటప్పుడు విపరీతమైన నొప్పి అనిపిస్తే.గొంతు లోపల తెల్లటి మచ్చలు కనిపిస్తే.రెండు వారాలకు మించి గొంతు బొంగురుపోవడం తగ్గకపోతే. ఈ చిట్కాలు పాటించినప్పటికీ ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.