Weight Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా? కఠినమైన డైట్ వద్దు.. ఈ 4 అలవాట్లు చాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బరువు తగ్గడం(weight loss)అనగానే చాలామందికి గుర్తొచ్చేది కఠినమైన డైటింగ్, కేలరీల లెక్కలు, జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చడం. ఇవన్నీ పాటిస్తూ ఇష్టమైన ఆహారానికి దూరంగా ఆకలితో అలమటి స్తుంటారు. అయితే, ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఇవేవీ అవసరం లేదంటున్నారు ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణులు. సంక్లిష్టమైన ఆహార నియమాలను పక్కనపెట్టి, మన దైనందిన జీవితంలో కేవలం నాలుగు చిన్నపాటి మార్పులు చేసుకుంటే ఆరోగ్యకరమైన బరువును సులభంగా సొంతం చేసుకోవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. డైటింగ్ లేకుండానే ఫిట్‌గా ఉండేందుకు ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్న ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో చూద్దాం..

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

1. సాయంత్రం స్నాక్స్‌లో మార్పులు..

సాధారణంగా సాయంత్రం కాగానే ఏదైనా జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. సమోసాలు, బజ్జీలు, బేకరీ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా పండ్లు, ఉడికించిన కూరగాయల ముక్కలు, మొలకలు, గుడ్లు వంటి ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది కడుపు నిండిన భావన కలిగించడంతో పాటు అనవసరమైన కేలరీలు శరీరంలోకి చేరకుండా అడ్డుకుంటుంది.

2. రోజంతా చురుకుగా ఉండటం..

ఉదయం ఒక గంట వ్యాయామం చేసి, ఆ తర్వాత రోజంతా కుర్చీకే పరిమితం అవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. నిత్యం చురుకైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. పని మధ్యలో కాసేపు లేచి నడవడం, లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, ఇంట్లో చిన్నపాటి పనులు చేసుకోవడం ద్వారా రోజంతా శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచాలి.

3. తేలికపాటి ఆకలికి అలవాటు పడటం..

కొద్దిగా ఆకలి వేయగానే వెంటనే ఏదో ఒకటి తినేయడం మంచిది కాదు. తరచుగా చిరుతిళ్లు తినే అలవాటును తగ్గించుకోవాలి. కడుపు నిండా అతిగా తినకుండా, కొద్దిపాటి ఆకలిని భరించడం శరీరానికి అలవాటు చేయాలి. అవసరమైనప్పుడే మితంగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి, బరువు సులభంగా అదుపులోకి వస్తుంది.

4. నిద్రకు నిర్దిష్టమైన సమయం..

బరువు తగ్గడంలో, ఆరోగ్య నిర్వహణలో నిద్రది అత్యంత కీలక పాత్ర. రోజూ రాత్రి ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతి దొరికినప్పుడే జీవక్రియలు (metabolic function) సక్రమంగా జరిగి హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.

 కొత్త డైట్ ప్లాన్స్ లేదా కఠినమైన వర్కవుట్స్ కోసం వెతికే బదులు.. ఈ నాలుగు ప్రాథమిక జీవనశైలి అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తే దీర్ఘకాలంలో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సరైన బరువును సొంతం చేసుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.