Dark Chocolate amazing health Benefits : డార్క్ చాక్లెట్‌తో మెదడు నుంచి గుండె వరకు..! అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..   

షేర్ చేయండి:

heసాక్షి లైఫ్ : చాక్లెట్ అనగానే చాలామందికి నోరూరడంతో పాటు, కేవలం ఇవి తీపి పదార్థాలని, అనారోగ్యకరమని భావిస్తుంటారు. కానీ, అన్ని చాక్లెట్లు ఒకేలా ఉండవు. మితంగా డార్క్ చాక్లెట్ తీసుకుంటే.. రుచితో పాటు శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. అందుకే ఇటీవల కాలంలో డార్క్ చాక్లెట్‌ను హెల్తీ స్నాక్‌గా తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉండే డార్క్ చాక్లెట్‌ను మితంగా తీసుకుంటే మెదడు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్, మినరల్స్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

మెదడు చురుకుగా..

డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత చురుగ్గా ఉంటాయి. వయసు పైబడే కొద్దీ వచ్చే మతిమరుపు, ఇతర మానసిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

బీపీ అదుపులో..

 డార్క్ చాక్లెట్‌లోని సహజ సమ్మేళనాలు రక్తనాళాలను విశ్రాంతి పరిచేందుకు దోహదపడతాయి. తద్వారా రక్తప్రసరణ మెరుగై, రక్తపోటు (bp) నియంత్రణలో ఉంటుంది. అయితే, ఇది బీపీ మందులకు ప్రత్యామ్నాయం కాదు, ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

గుండెకు రక్ష..

డార్క్ చాక్లెట్‌లోని పాలీఫెనాల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. మితంగా దీన్ని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) ఆక్సీకరణను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరిగేలా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఒత్తిడి మాయం..

డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరంలో మూడ్‌ను ఉత్తేజపరిచే కొన్ని రసాయనాల స్థాయి పెరుగుతుంది. అందుకే ఒత్తిడి లేదా అలసటగా ఉన్నప్పుడు కొద్దిగా చాక్లెట్ తింటే మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగని దీన్ని ప్రతిసారీ అలవాటుగా మార్చుకోకూడదు.

యాంటీ ఆక్సిడెంట్ల గని..

ఇందులో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని అరికట్టి, కణాలను రక్షిస్తాయి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

డార్క్ చాక్లెట్ తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు..

కోకో శాతం.. 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌ను మాత్రమే ఎంచుకోవాలి.పరిమితి..రోజుకు 20 నుంచి 30 గ్రాములకు మించి తినకూడదు. అతిగా తింటే అనర్థాలు తప్పవు. అధిక చక్కెర, క్యారామెల్ వంటివి కలిపిన చాక్లెట్లకు దూరంగా ఉండాలి.

ఆరోగ్య సమస్యలుంటే..మధుమేహం, ఊబకాయం సమస్య ఉన్నవారు మోతాదు విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి.కేవలం చాక్లెట్ తినడం వల్లనే ఆరోగ్యం రాదు.. దీనితో పాటు సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం చాలా అవసరం.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.