Constipation : మలబద్ధకంతో చర్మంపై ముడతలా..? ముఖం కాంతి తగ్గడానికి కారణం ఇదేనా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కడుపులో గడబిడ, మలబద్ధకం.. ఇవి కేవలం జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు మాత్రమే కావు. వీటి ప్రభావం మన చర్మంపై కూడా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ముఖంపై ఉండే సహజ కాంతి తగ్గిపోవడానికి, రకరకాల చర్మ సమస్యలు దరిచేరడానికి మలబద్ధకమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు కడుపులోని సమస్యలకు, ముఖంపై వచ్చే మచ్చలకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

దీర్ఘకాలిక సమస్యతో చర్మానికి ముప్పు..

సాధారణంగా మలబద్ధకం వస్తే ఇంటి చిట్కాలు లేదా మందులతో తగ్గిపోతుంది. కానీ, దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడేవారిలో (chronic constipation) చర్మంపై దుష్ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తాయి. మన చర్మం తీరును బట్టి మన ఆరోగ్య పరిస్థితిని సులభంగా అంచనా వేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. కడుపులో తలెత్తే ఇబ్బందులు చర్మం ద్వారా బయటపడతాయి కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

ఎగ్జిమా (Eczema) ముప్పు రెట్టింపు..

మలబద్ధకం వల్ల చర్మవ్యాధులు వస్తాయా అన్న కోణంలో పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. తైవాన్‌లో సుమారు 1.70 లక్షల మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మలబద్ధకం లేని వారితో పోలిస్తే, ఆ సమస్య ఉన్నవారిలో 'ఎగ్జిమా' అంటే చర్మం ఎర్రబడటం, దురద వచ్చే ప్రమాదం ఏకంగా రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, పెద్దపేగు నిర్మాణంలో ఉండే వ్యత్యాసాల వల్ల మలబద్ధకం ముప్పు కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అయితే, పురుషుల్లోనూ ఈ ముప్పు ఏమాత్రం తక్కువ కాదని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

మొటిమలు, మచ్చలకు కారణం ఇదే..

మన చర్మం, పేగుల గోడలు.. ఈ రెండూ కూడా అలర్జీలు, వ్యాధికారక క్రిముల నుంచి శరీరాన్ని రక్షించే కవచాల్లా పనిచేస్తాయి. ఎప్పుడైతే జీర్ణవ్యవస్థ పనితీరు మందగించి మలబద్ధకం వస్తుందో, అప్పుడు శరీరంలోని వ్యర్థాలను (toxins) బయటకు పంపేందుకు మన దేహం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతుంది.

ఈ క్రమంలో ఆ విషతుల్యమైన వ్యర్థాలు చర్మం ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. దీనివల్లే ముఖంపై మచ్చలు, దద్దుర్లు, మొటిమలు వస్తుంటాయి. కళ్ల కింద నల్లటి వలయాలు (dark circles), కళ్లు ఉబ్బినట్లుగా ఉండటం వంటివి కూడా ఈ జీర్ణకోశ సమస్యల వల్లే వస్తాయని వైద్యులు వివరిస్తున్నారు.

నివారణ ఎలా మరి..?

మీకు తరచుగా చర్మ సమస్యలు వస్తూ, ముఖం కళావిహీనంగా మారుతుంటే వాడాల్సినవి సౌందర్య సాధనాలు కాదు.. ముందుగా జీర్ణవ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి. పీచు పదార్థాలు (Fiber)..మీ రోజువారీ ఆహారంలో ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలను చేర్చుకోవాలి. ఇవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. ప్రోబయోటిక్స్ (Probiotics)..పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియా కోసం పెరుగు, మజ్జిగ లాంటి ప్రోబయోటిక్స్‌ను రోజూ తీసుకోవాలి.

నీరు, వ్యాయామం.. తగినన్ని నీళ్లు తాగడం, రోజువారీ వ్యాయామం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే దేహంలోని వ్యర్థాలు సక్రమంగా బయటకు వెళ్లిపోతాయి. తద్వారా చర్మం ఎటువంటి మచ్చలు లేకుండా సహజమైన కాంతితో మెరిసిపోతుంది.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.