Alternative to Ozempic : ఒజెంపిక్ కు ప్రత్యామ్నాయంగా మరొక చౌకైన జెనరిక్ వెర్షన్‌కు కెనడా ఆరోగ్య శాఖ ఆమోదం..
సాక్షి లైఫ్ : టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగులకు ఒక తీపి కబురు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన మధుమేహం మందు 'ఒజెంపిక్' (Ozempic) కు ప్రత్యామ్నాయంగా మరొక చౌకైన జెనరిక్ వెర్షన్‌కు కెనడా ఆరోగ్య శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. కెనడాకు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం 'అపోటెక్స్' (Apotex), ఆర్బిక్యులర్ ఫార్మాస్యూటికల్స్‌తో కలిసి 'అపో-సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్' (Apo-Semaglutide Injection) పేరుతో ఈ కొత్త ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురానుంది.
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
మధుమేహ నియంత్రణకు మేలు..ఈ ఇంజెక్షన్ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్న వయోజనులలో సరైన ఆహారం, వ్యాయామంతో పాటు దీనిని వారానికి ఒకసారి తీసుకునేలా రూపొందించారు. ఈ ఔషధం రెండు వేర్వేరు పెన్ ఫార్మాట్లలో రోగులకు అందుబాటులోకి రానుంది. 2 మిల్లీగ్రాముల పెన్.. ద్వారా 0.25 mg లేదా 0.5 mg డోసులను తీసుకోవచ్చు. 4 మిల్లీగ్రాముల పెన్.. ద్వారా 1 mg డోసును నేరుగా తీసుకోవచ్చు.
అందరికీ అందుబాటులోకి..
ప్రస్తుతం డయాబెటిస్ నివారణకు వాడే ఖరీదైన బ్రాండెడ్ మందుల భారం సామాన్యులపై ఎక్కువగా పడుతోంది. ఇలాంటి తరుణంలో నాణ్యమైన జెనరిక్ మందు అందుబాటులోకి రావడం వల్ల వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. రోగులకు తక్కువ ధరలోనే నాణ్యమైన వైద్యం అందించాలనే మా నిబద్ధతకు ఈ ఆమోదం ఒక నిదర్శనం. త్వరలోనే ఈ జెనరిక్ ఇంజెక్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తాం," అని అపోటెక్స్ కెనడా ప్రతినిధులు వెల్లడించారు. ఈ కొత్త జెనరిక్ రాకతో అటు రోగులకు, ఇటు ఆరోగ్య రంగానికి ఎంతో మేలు చేకూరనుంది.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
