Dandruff Control : చుండ్రు సమస్య వేధిస్తోందా..? ఈ టిప్స్ తో చెక్ పెట్టండిలా..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలం రాగానే వాతావరణంలో తేమ అమాంతం పెరుగుతుంది. దీని ప్రభావం మన చర్మంపైనే కాకుండా కురులు, మాడు ( scalp) పైనా తీవ్రంగా పడుతుంది. చెమట, గాలిలోని తేమ, వానలో తడవడం వల్ల తలలో దురద, జిగటతో పాటు చుండ్రు సమస్య వేధిస్తుంది. భుజాలపై రాలే చుండ్రు పొట్టు ఒక్కోసారి నలుగురిలో ఇబ్బందిగా మారుతుంది. ఈ కాలంలో కేశ సంరక్షణకు సంబంధించి పలు జాగ్రత్తలు పాటిస్తే చుండ్రు సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు.

 

ఇది కూడా చదవండి..Constipation : మలబద్ధకంతో చర్మంపై ముడతలా..? ముఖం కాంతి తగ్గడానికి కారణం ఇదేనా..?

ఇది కూడా చదవండి..Digestive problems : భోజనం చేసిన వెంటనే మలవిసర్జనకు వెళ్లాలనిపించడం వ్యాధి లక్షణమా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

 

పెరుగుతో మాడుకు మేలు..

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్, ఇతర పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇది మాడుకు కావాల్సిన తేమను అందించి పొడిబారకుండా చేస్తుంది. కొద్దిగా పెరుగును తలకు పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆగి, ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. అయితే, పెరుగు రాసుకున్నప్పుడు మంట లేదా దురదగా అనిపిస్తే వెంటనే ఈ చిట్కాను ఆపేయాలి.

నిమ్మకాయతో కాస్త జాగ్రత్త..!

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. చాలామంది చుండ్రు తగ్గడానికి నిమ్మరసాన్ని నేరుగా తలకు రాస్తుంటారు. కానీ ఇది అందరికీ మంచిది కాదు. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి మాడుపై ఇది తీవ్రమైన మంట, చికాకును కలిగిస్తుంది. అందుకే నిమ్మను నేరుగా వాడకపోవడమే మంచిది. ఏదైనా ప్రయోగం చేసే ముందు చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

జుట్టును తడిగా వదిలేయొద్దు..

వానలో తడిసినప్పుడు జుట్టును అలాగే గాలికి ఆరుతుందిలే అని వదిలేస్తుంటారు. తడిగా ఉన్న జుట్టు, మాడు వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు మరింత పెరిగే ప్రమాదం ఉంది. వానలో తడిసిన వెంటనే శుభ్రమైన నీటితో తలస్నానం చేసి, సున్నితంగా ఆరబెట్టుకోవాలి. హెయిర్ డ్రయ్యర్ల వంటి అధిక వేడిని ఇచ్చే పరికరాలను వాడకపోవడమే మంచిది.

క్రమం తప్పకుండా తలస్నానం..

చుండ్రును వదిలించుకోవడానికి మాడును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ జుట్టు స్వభావాన్ని బట్టి వారానికి రెండు లేదా మూడు సార్లు షాంపూ చేసుకోవాలి. చుండ్రు మరీ ఎక్కువగా ఉంటే వైద్యుల సలహాతో మెడికేటెడ్ యాంటీ-డాండ్రఫ్ షాంపూ వాడాలి. షాంపూను కేవలం జుట్టు పైభాగంలోనే కాకుండా కుదుళ్లకు అంటేలా మర్దన చేసి శుభ్రం చేసుకోవాలి.

వ్యక్తిగత శుభ్రత ముఖ్యం..

మనం రోజూ వాడే దువ్వెన, టవల్, దిండు కవర్లు కూడా చుండ్రుకు కారణం కావచ్చు. వానాకాలంలో వీటిని ఎప్పటికప్పుడు వేడి నీటితో ఉతుక్కొని, పూర్తిగా ఎండలో ఆరేలా చూసుకోవాలి. అలాగే ఒకరు వాడిన దువ్వెనలు, టవల్స్, హెయిర్ బ్యాండ్స్ మరొకరు వాడకూడదు.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

  ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.