Eating Dinner Late..? : రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా..? ఐతే ఈ వ్యాధుల ముప్పుతప్పదు..!
సాక్షి లైఫ్ : ఉరుకులు పరుగుల జీవితం, పని ఒత్తిడి కారణంగా చాలామంది రాత్రిళ్లు ఇల్లు చేరేసరికే బాగా ఆలస్యమవుతుంటుంది. ఎప్పుడో ఒకప్పుడు కడుపు నింపుకుంటే పర్వాలేదు కదా అని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఈ చిన్న పొరపాటు మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా తినే అలవాటు శరీర సహజ జీవ గడియారాన్ని (circadian rhythm) దెబ్బతీసి, అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
పగటిపూట మన జీర్ణవ్యవస్థ ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. కానీ రాత్రివేళ విశ్రాంతి తీసుకుని, తనను తాను మరమ్మతు చేసుకునే స్థితిలోకి వెళుతుంది. ఆ సమయంలో భారీగా భోజనం చేయడం వల్ల వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది.
ఎముకల పటుత్వానికి ముప్పు..
రాత్రి పూట ఆలస్యంగా తినడం వల్ల ఎముకల పటుత్వం తగ్గుతుందని 'జర్నల్ ఆఫ్ ది ఎండోక్రైన్ సొసైటీ' నివేదించింది. జపాన్‌లోని నారా మెడికల్ యూనివర్సిటీ దాదాపు 9.2 లక్షల మందిపై (వీరిలో 45.3శాతం పురుషులు, 54.7శాతం మహిళలు) నిర్వహించిన విస్తృత అధ్యయనం లో ఈ విషయం వెల్లడైంది. తరచుగా ఉదయం అల్పాహారం మానేయడం, రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల ఆస్టియోపొరోసిస్ ముప్పు పెరుగుతుందని, తద్వారా కీళ్ల నొప్పులు, ఎముకలు సులువుగా విరిగే ప్రమాదం ఉందని తేలింది.
ఊబకాయం బారిన పడే అవకాశాలు..
రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేసేవారిలో ఊబకాయం బారిన పడే అవకాశాలు ఎక్కువని 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' అధ్యయనం పేర్కొంది. రాత్రి పూట శారీరక శ్రమ దాదాపు శూన్యం కాబట్టి మనం తీసుకున్న ఆహారంలోని అదనపు కేలరీలు కరగకుండా కొవ్వుగా పేరుకుపోతాయి. అలాగే, రాత్రివేళ ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి గ్లూకోజ్ నియంత్రణ కష్టమవుతుంది.
పొంచి ఉన్న అనారోగ్య సమస్యలు..
నిద్రపోయే ముందు కడుపు నిండా తినడం వల్ల జీర్ణాశయానికి ఆహారాన్ని అరిగించడానికి తగినంత సమయం దొరకదు. దీంతో ఎసిడిటీ, ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. మనం నిద్రపోయే సమయానికి జీర్ణవ్యవస్థ పనిచేస్తూ ఉండటం వల్ల గాఢనిద్ర పట్టదు. మంచి నిద్రను ప్రేరేపించే 'మెలటోనిన్' అనే హార్మోన్ ఉత్పత్తికి కూడా ఇది తీవ్ర ఆటంకం కలిగిస్తుంది.
మధుమేహం ముప్పు..
రాత్రి సమయంలో శరీర జీవక్రియ (metabolism) చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటప్పుడు గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా ప్రాసెస్ చేయలేక రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. రాత్రి భోజనం వీలైనంత త్వరగా ముగించడం, ముఖ్యంగా నిద్రపోవడానికి కనీసం రెండు నుంచి మూడు గంటల ముందే తినడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అలాగే రాత్రివేళ తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
