సాక్షి లైఫ్ : బరువు తగ్గడానికి, జిమ్‌లో చెమటలు పట్టేలా వర్కౌట్స్ చేయడం మాత్రమే సరిపోదు, తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో సరైన సూపర్‌ఫుడ్స్ చేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. కొన్ని రకాల విత్తనాలు మీ జీవక్రియను పెంచగలవని, మీ ఆకలిని నియంత్రించగలవని, కొవ్వును తగ్గించడంలో మీకు సహాయపడతాయని తెలుసా..? అవును.. పలురకాల విత్తనాలు బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా చేస్తాయి.
ఇది కూడా చదవండి..తాజా పరిశోధన : ఫ్యాటి లివర్ నివారణకు మందులతో పనిలేకుండా ఏం చేస్తే సరిపోతుంది..?
ఇది కూడా చదవండి..ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి..
ఇది కూడా చదవండి..విటమిన్ "డి" తగ్గిపోవడానికి ఆరు కారణాలు..
కొన్ని విత్తనాలను మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా, మీరు త్వరగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడంతో పాటు, ఈ విత్తనాలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఈ విత్తనా పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి మరియు జీవక్రియను పెంచుతాయి అలాగే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి, తద్వారా తరచుగా తినే అలవాటు తగ్గుతుంది.
మీరు కూడా కొవ్వు నుండి ఫిట్ కు ప్రయాణాన్ని సులభతరం చేయాలనుకుంటే, ఈ 5 సూపర్ సీడ్స్ మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
చియా విత్తనాలు..
చియా విత్తనాలను బరువు తగ్గించే సూపర్ ఫుడ్ అంటారు. వీటిలో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాదు చియా గింజలు నీటిలో నాన బెట్టి తింటే కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. అతిగా తినకుండా నిరోధించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
ఎలా తినాలి..?
చియా విత్తనాలను రాత్రి సమయంలో నీటిలో నాన బెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. వీటిని స్మూతీ, పెరుగు లేదా ఓట్ మీల్ లో కలిపి తినవచ్చు.
అవిసె గింజలు..
అవిసె గింజలు బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వాటిలో ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఎక్కువ కాలం ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా కొవ్వును తగ్గించడంలో సహాయపడుతాయి.
ఎలా తినాలి.. ?
అవిసె గింజలను తేలికగా వేయించి, గ్రైండ్ చేసి స్మూతీ, సలాడ్, పెరుగు లేదా సూప్‌లో కలపండి.
ప్రతిరోజూ 1-2 టీస్పూన్ల అవిసె గింజల పొడి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
గుమ్మడికాయ గింజలు..
మీరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలనుకుంటే, ఖచ్చితంగా గుమ్మడికాయ గింజలను తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్, జింక్, మెగ్నీషియం వంటివి ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మీ శరీరాన్ని బలోపేతం చేయడంలో అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
ఎలా తినాలి..?
మీరు వాటిని వేయించి స్నాక్‌గా తినవచ్చు. వీటిని సలాడ్, స్మూతీ లేదా ఓట్స్‌లో కలిపి తినాలి.
పొద్దుతిరుగుడు విత్తనాలు..
బరువు తగ్గడానికి శక్తిని నిర్వహించడం కూడా ముఖ్యం, పొద్దుతిరుగుడు విత్తనాలు అందుకు బాగా సహాయ పడతాయి. వాటిలో విటమిన్ బి, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలో శక్తిని నిర్వహిస్తాయి.
ఎలా తినాలి..?
వీటిని వేయించి స్నాక్‌గా తినవచ్చు. పెరుగు, ఓట్స్ లేదా స్మూతీలతో కలిపి కూడా తీసుకోవచ్చు.
నువ్వులు..
చిన్న నువ్వులలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా కొవ్వును తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
ఎలా తినాలి.. ?
నువ్వులను సలాడ్, పరాఠా లేదా స్మూతీస్ తో కలిపి తీసుకోవచ్చు. వీటిని కొద్దిగా వేయించి, బెల్లంతో కలిపి తింటే, రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com