Summer Season : ఎండాకాలంలో 'ఫుడ్ పాయిజనింగ్' కు ప్రధాన కారణాలు..? 

షేర్ చేయండి:
Summer Season : ఎండాకాలంలో 'ఫుడ్ పాయిజనింగ్' కు ప్రధాన కారణాలు..? 

సాక్షి లైఫ్ : వేసవి కాలం రాగానే ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరుగుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో 'ఫుడ్ పాయిజనింగ్' (Food Poisoning) కేసులు సర్వసాధారణం. వేడి వాతావరణం వల్ల ఆహారం త్వరగా పాడవడం, అందులో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణం. బయటి కలుషిత ఆహారం, ఎక్కువసేపు నిల్వ ఉంచిన పదార్థాలు, కోసి పెట్టిన పండ్లు తినడం వల్ల కడుపులో గడబిడ మొదలవుతుంది.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, నీరసం వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఫుడ్ పాయిజనింగ్ బారిన పడినప్పుడు కంగారు పడకుండా ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు.

ముందుగా ఏం చేయాలి అంటే..? 

 ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు వాంతులు, విరేచనాల వల్ల శరీరంలోని నీరు, ముఖ్యమైన లవణాలు వేగంగా బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్‌కు గురవుతారు. కాబట్టి ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్ (ORS) ద్రావణం, కొబ్బరి నీళ్లు లేదా ఇంట్లోనే ఉప్పు, చక్కెర కలిపిన నీళ్లను తరచుగా తీసుకోవాలి.

ఆహారం విషయంలో మార్పులు..

ఈ సమయంలో జీర్ణవ్యవస్థ అప్పటికే ఒత్తిడికి గురై ఉంటుంది కాబట్టి దానికి కొంత విశ్రాంతినివ్వాలి. నూనె పదార్థాలు, మసాలాలు, బరువైన ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. త్వరగా, సులభంగా జీర్ణమయ్యే గంజి, ఉడికించిన బంగాళదుంపలు, పెరుగన్నం లాంటివి మాత్రమే కొద్దికొద్దిగా తీసుకోవాలి.

విశ్రాంతి తప్పనిసరి..

వాంతులు, విరేచనాల వల్ల శరీరం అప్పటికే బాగా నీరసించి ఉంటుంది. కాబట్టి శారీరక శ్రమను పూర్తిగా తగ్గించాలి. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకుంటే శరీరం త్వరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?

చాలావరకు తేలికపాటి ఫుడ్ పాయిజనింగ్ సరైన విశ్రాంతి, ద్రవాహారంతో తగ్గిపోతుంది. కానీ, కింది లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి. 

వాంతులు ఏమాత్రం ఆగకపోవడం.

తీవ్రమైన జ్వరం రావడం.

విరేచనాల్లో రక్తం పడటం.

కళ్లు తిరిగిపడిపోయేంత విపరీతమైన నీరసం.

 చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీల విషయంలో ఈ లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం ఉత్తమం.

 ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఎప్పటికప్పుడు వండిన తాజా ఆహారాన్నే తీసుకోవాలి. ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచినవి తినకూడదు.

బయట రోడ్ల పక్కన దొరికే అపరిశుభ్రమైన పదార్థాలు, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

వంట చేసే ముందు, తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి.

 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.