హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ కు మెయిన్ రీజన్స్.. 

సాక్షి లైఫ్ : పలురకాల మినరల్స్ లోపించడం వల్ల జుట్టు రాలుతుంది. ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి త‌దిత‌ర పోష‌కాల లోపం వ‌ల్ల జుట్టు బాగా రాలుతుంది. కాబట్టి ఇవి డైట్‌లో ఉండేలా చేసుకోవాలి. అందకు పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి. పాల‌కూర‌లో ఉండే పోష‌కాలు జుట్టు పెరుగుద‌ల‌కు స‌హాయ ప‌డ‌తాయి. పాల‌కూర జుట్టుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన కండిష‌నింగ్‌ను అందిస్తుంది. పాల‌కూర‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి..ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 ఇది కూడా చదవండి..రీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

రకరకాల షాంపులు.. 


ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లమ్ అయిపొయింది. రకరకాల షాంపులు, ఆయిల్స్‌, పొల్యూషన్‌ వల్ల చాలామందిలో జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. మరి వెంట్రుకలు బాగా పెరిగి హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌ అవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?  అందుకు మీ రోజువారీ ఫుడ్ మెనూ లో ఎలాంటి మార్పు, చేర్పులు చేసుకుంటే బెటర్..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

డ్రైఫ్రూట్స్‌.. 

ఆహారంలో ప్రతిరోజూ నట్స్‌ తీసుకోవలి. బాదంపప్పు, పిస్తాప‌ప్పు, కాజు మొదలైన డ్రైఫ్రూట్స్‌ని ప్రతిరోజూ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్‌ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్ సహా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు, చర్మం ఆరోగ్యానికి గొప్పగా పనిచేస్తాయి.  ముఖ్యంగా ప్రతిరోజూ బాదం తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లను బలంగా, సిల్కీగా ఉండేలా చేస్తుంది


 జుట్టు ఒత్తుగా.. 

కోడిగుడ్లలో ప్రొటీన్‌, విటమిన్ బి12, ఐరన్, జింక్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కురుల పెరుగుదలకు సహాయపడతాయి. గుడ్డు పచ్చసొనలో ఉండే.. విటమిన్‌ A,E, బయోటిన్, ఫోలేట్ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడతాయి. అందువల్ల ప్రతిరోజూ ఓ గుడ్డు తినాలి. చేపల్లో ఒమెగా 3, ఒమెగా 6 త‌దిత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, విట‌మిన్ డి, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చూస్తాయి. జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్పడతాయి. గుడ్డులోని జింక్‌, బయోటిన్‌ ఆరోగ్యవంతమైన జుట్టుకు తోడ్పడుతుంది. 

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌.. 

సాల్మన్‌ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా డెడ్‌ హెయిర్‌ సెల్స్‌ను తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. సాల్మన్, సార్డినెస్, మాకెరెల్ వంటివి ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉండే చేపలు. ఈ చేపల్లో ప్రొటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి6 కూడా అధికంగా లభిస్తాయి.  వీటన్నింటిలో సాల్మన్ చేపలు మరీ ఆరోగ్యకరమైనవి.

చుండ్రు.. 

పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు, ఔషధ గుణాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడు తుంది. వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి మెరుపును అందిస్తాయి. పెరుగు తినడమే కాకుండాహెయిర్ కు ప్యాక్‌ వేసుకోవడం వల్ల కూడా జుట్టు రాలు సమస్య కంట్రోల్‌లో ఉంటుంది. చుండ్రుతో బాధపడుతున్న వాళ్లు వారానికి ఒకసారి పెరుగుతో ప్యాక్‌ వేసుకుంటే చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది.


బెర్రీస్.. 

బెర్రీస్ ప్రతిరోజూ బెర్రీలను తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఎందుకంటే బెర్రీస్‌లో జుట్టుకు ఉపయోగపడే విటమిన్ "సి" పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ బెర్రీలను డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. 

స్వీట్ పొటాటో.. 

జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతుంటే ఆహారంలో చిలగడదుంపను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్‌ "ఏ" లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి జుట్టు పెరుగుదలకు చిలగడదుంపను మీ డైట్‌లో ఉండేలా చూసుకోండి. 

  ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

  ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : hair-loss hair-fall-problem white-hairs healthy-hair papaya-benefits-for-hair sesame-seeds-for-hair hair-loss-treatment hair-loss-causes how-to-stop-hair-loss hair-loss-cure causes-of-hair-loss hair-loss-remedy causes-of-hair-loss-in-women female-pattern-hair-loss hair-loss-treatment-for-women hair-loss-in-women hair-loss-women female-hair-loss hair-growth male-pattern-hair-loss hair-loss-solution the-most-common-cause-of-hair-loss hair-loss-men prevent-hair-loss what-causes-hair-loss causes-of-hair-fall hair-loss-cause

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com