సాక్షి లైఫ్: సిఓపిడి, లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(chronic obstructive pulmonary disease), అనేది ఊపిరితిత్తులకు ఆక్సిజన్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇది తీవ్రమయ్యే వ్యాధి, అంటే దాని లక్షణాలు (COPD symptoms) కాలక్రమేణా తీవ్రమవుతాయి.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
సిఓపిడిని నిర్వహించడానికి చిట్కాలు..
పలు ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే సిఓపిడిని నియంత్రించవచ్చు. అంతేకాదు ఆసుపత్రిలో చేరకుండా కొంతమేర ఆయా వ్యాధిని నివారించవచ్చు. సిఓపిడి ని నిర్వహించే బాధ్యత రోగితో పాటు, వారి సంరక్షకులపై ఉంటుంది. దీనికి మందులు మాత్రమే కాకుండా జీవనశైలి మార్పులు కూడా అవసరం. సిఓపిడిని నిర్వహించడానికి ఏమి చేయాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ధూమపానం మానేయండి..
సిఓపిడి రోగులు ధూమపానం పూర్తిగా మానేయాలి. అప్పుడప్పుడు ధూమపానం కూడా ప్రాణాంతకం కావచ్చు. సిగరెట్ ఆరోగ్యాన్ని మరింతగా నాశనం చేస్తుంది. అందుకోసమే పొగాకుతోపాటు, పొగాకు ఉత్పత్తులు పూర్తిగా మానేయడం ఉత్తమం.
ఇన్హేలర్లు..
సిఓపిడి(COPD) చికిత్సకు ఇన్హేలర్లు ప్రాథమికమైనవి. అవి శ్వాస ఆడకపోయినప్పుడు మాత్రమే ఉపయోగించాల్సిన మందులు కాదు. ఇవి ఊపిరితిత్తులలో మంటను నియంత్రించే అడ్డంకులు తీవ్రం కాకుండా నిరోధించే సాధారణ మందులు. ఇన్హేలర్‌ను వదిలివేయడం అంటే మీ స్వంత ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయడం లాంటిది. మీ వైద్యుడు సూచించిన మోతాదు, సమయాన్ని అనుసరించండి, సరైన ఇన్హేలర్ టెక్నిక్ నేర్చుకోండి,దానిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
క్రమం తప్పకుండా వ్యాయామం, ఫిజియోథెరపీ..
శ్వాస ఆడకపోవచ్చనే అపోహతో భయపడి శారీరక వ్యాయామం ఆపడం పెద్ద తప్పు. కాబట్టి తప్పనిసరిగా క్రమం తప్పకుండా, తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇలా చేసే వ్యాయామం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
డయాఫ్రాగ్మాటిక్ శ్వాస..ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది ప్రతిరోజూ నడక చాలా అవసరం. క్రమంగా నడక సమయాన్ని పెంచాలి. సుమారు అర్థ గంటపాటు నడవడం అలవాటు చేసుకోవాలి.
వాయు కాలుష్యం, అలెర్జీ కారకాలు సిఓపిడి రోగులకు ప్రాణాంతకం కావచ్చు. వీటిని నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇండోర్ కాలుష్యం.. అగరుబత్తులు, దోమ కాయిల్స్, రూమ్ ఫ్రెషనర్లు అగర్బత్తి పొగ తగల కుండా చూసుకోవాలి. వంటగదిలో చిమ్నీని ఉపయోగించాలి. బహిరంగ కాలుష్యం.. కాలుష్య స్థాయిని బట్టి, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండడం మంచిది. బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చింతం N95 మాస్క్ ధరించాలి.
దుమ్ము, చల్లని గాలి ఉన్న సమయంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా శీతాకాలంలో, చల్లని గాలి ఉన్న సమయంలో బయటకు రాకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా నోరు, ముక్కుకు మాస్క్ పెట్టుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పోషకమైన, ప్రోటీన్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవడంతోపాటు, పుష్కలంగా నీరు తాగాలి. సిఓపిడి ఉన్న బాధితుల్లో చిన్న ఇన్ఫెక్షన్ కూడా తీవ్రంగా మారుతుంది. కఫం పసుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారితే, దగ్గు తీవ్రమైతే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటివి అనిపిస్తే, వెంటనే వైద్యులని సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com