Real or Fake Saffron..? : కుంకుమపువ్వు అసలైనదా..? నకిలీదా..? ఇలా ఇట్టే గుర్తించండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కుంకుమపువ్వు (Saffron) అనగానే మంచి సువాసన, ఆహ్లాదకరమైన రంగు గుర్తుకొస్తాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. ధర ఎక్కువ కావడం వల్ల మార్కెట్లో దీనికి నకిలీ బెడద కూడా ఎక్కువే. చూడటానికి అచ్చం అసలైన కుంకుమపువ్వులాగే కనిపించే రంగుల దారాలు, ఇతర పదార్థాలను కల్తీ చేస్తుంటారు. కాబట్టి ప్యాకింగ్, ధర చూసి గుడ్డిగా నమ్మేయడం సరికాదు. మరి మనం కొన్న కుంకుమపువ్వు స్వచ్ఛమైనదో కాదో నిమిషాల్లో ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..ప్రపంచంలోనే తొలిసారిగా గొర్రెలో బర్డ్ ఫ్లూ..  

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

 

నీటితో పరీక్ష..

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు, మూడు కుంకుమపువ్వు రేకులను వేయాలి. అసలైనదైతే నెమ్మదిగా నీటిని బంగారు-పసుపు రంగులోకి మారుస్తుంది. అంతేకాకుండా ఆ రేకుల ఎరుపు రంగు కూడా అలాగే నిలిచి ఉంటుంది. ఒకవేళ నీటిలో వేయగానే వేగంగా రంగు వదిలేసి, ఆ రేకులు తెలుపు రంగులోకి మారితే అది కచ్చితంగా నకిలీదే అని గుర్తించాలి.

పాలతో ఇలా..

కొద్దిగా గోరువెచ్చని పాలలో కొన్ని కుంకుమపువ్వు రేకులను వేసి కాసేపు వదిలేయాలి. స్వచ్ఛమైన కుంకుమపువ్వు పాలను నెమ్మదిగా లేత బంగారు రంగులోకి మార్చడంతో పాటు, దానికి ఉండే ప్రత్యేకమైన సువాసనను పాలకు అందిస్తుంది. రంగు ఒక్కటే కాకుండా వాసనను కూడా గమనించాలి.

సువాసనతో పసిగట్టొచ్చు..

అసలైన కుంకుమపువ్వుకు తీయగా, తేనె, గడ్డి వాసనలు కలిసినట్లుగా ఒక సహజమైన మట్టి సువాసన ఉంటుంది. అదే నకిలీదైతే అందులోంచి ఘాటైన రసాయనాల వాసన లేదా కృత్రిమ వాసన వస్తుంది.

రేకుల ఆకృతిని గమనించండి..

స్వచ్ఛమైన కుంకుమపువ్వు రేకులు సన్నగా, పొడిగా ఉండి.. ఒక చివర కాస్త వెడల్పుగా ఉంటాయి. రేకులన్నీ కచ్చితంగా ఒకే పరిమాణంలో ఉండవు. మరీ నిగనిగలాడుతూ, అన్నీ ఒకే ఆకారంలో కాగితం ముక్కల్లా ఉంటే అవి కల్తీవి కావొచ్చు.

కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎప్పుడూ నమ్మకమైన వ్యాపారుల వద్ద లేదా బ్రాండ్లనే ఎంచుకోవాలి. ప్యాకింగ్, బ్యాచ్ నంబర్, నాణ్యతా ప్రమాణాల వివరాలను తప్పకుండా చెక్ చేయాలి. మార్కెట్ ధర కంటే మరీ తక్కువ ధరకు వస్తుందంటే అది నకిలీది అయ్యే అవకాశం ఎక్కువ. పొడి రూపంలో ఉండే కుంకుమపువ్వు కంటే, రేకులుగా కానీ దారాలుగా ఉన్నదే కొనడం ఉత్తమం. దీన్ని పరీక్షించడం కూడా తేలిక.

 

ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్.. 

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.