మొబైల్,ల్యాప్‌టాప్‌ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..? ఈ వ్యాధులు తప్పవు..   

సాక్షి లైఫ్ : ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం స్మార్ట్ ప్రపంచంలో ముంచేసింది. దీని కారణంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు చూస్తున్నారు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి అనారోగ్య సమస్యలను ని నివారించడానికి పలురకాల మార్గాలున్నాయి. అవేంటంటే..?  

ఇది కూడా చదవండి..అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?

ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..

ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?

ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే..ఏమి చేయాలి..?

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

గాడ్జెట్‌లు.. 


నేటి కాలంలో మనమందరం స్మార్ట్‌ఫోన్‌లు,టాబ్లు,ల్యాప్‌టాప్‌లు వంటి గాడ్జెట్‌లు మన జీవితంలో భాగమైపోయాయి. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా? స్మార్ట్ స్క్రీన్‌లను నిరంతరం చూడటం వల్ల వెన్ను, మెడ ,వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి. 

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం కారణంగా ఎముకలు సైతం బలహీనమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులలో వెన్నెముక సమస్యలు 50శాతంపైగా పెరిగాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

 డిజిటల్ పరికరాలపై ఎంత ఎక్కువగా ఆధారపడుతున్నామో, అంత వేగంగా వెన్నుపాము ప్రభావితమవుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల మెడ నొప్పి, భుజాలు బిగుసుకుపోవడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల నిద్రలేమి, జీర్ణ సమస్యలు, ఊబకాయ సమస్యలు తలెత్తుతాయి. ఆసుపత్రికి వచ్చే రోగులలో ఎక్కువ మంది మొబైల్-ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా వాడడం వల్ల మెడ, వెన్నునొప్పితో బాధపడుతున్నారని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల..  
 
గంటల తరబడి స్క్రీన్‌ పై గడపడం వల్ల మెడ బిగుసుకుపోవడం, భుజం నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు రావడమేకాకుండా మానసిక ఒత్తిడి పెరిగి మరిన్ని అనారోగ్య సమస్యల బారీన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

ప్రయాణంలో మొబైల్ ఉపయోగించడం లేదా పని సమయంలో ల్యాప్‌టాప్‌పై వంగి కూర్చోవడం, సరైన విధంగా కూర్చోకపోవడం లేదా ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండడం వంటివి వెన్నునొప్పికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. మెడ వంచి స్క్రీన్ వైపు చూస్తే మెడ, వీపు, వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. సాధారణ స్థితిలో, మెడ, వెనుకభాగం నిటారుగా ఉంటాయి కానీ నిరంతరం వంగడం వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది.

 

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

ఇది కూడా చదవండి..అధిక బరువును అదుపులో ఉంచడానికి కొన్ని చిట్కాలు ఇవిగో..

ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health bone-health weak-bones back-pain physical-health bone-and-joint-health smart-phone smart-phone-usage-and-health-problems do-smartphones-cause-eye-problems phone-addiction mobile-phone-impact-on-health mobile-phone-radiation mobile-phone-health-issues mobile-phone-mental-health mobile-phone-health-hazards mobile-phone-health-risks
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com