 
                                                        సాక్షి లైఫ్ : గుమ్మడి గింజలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఐతే కొంతమంది వాటిని పనికి రావని భావించి పడేస్తుంటారు. వాటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. గుమ్మడి గింజల్లో ఫైబర్, మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలున్నాయి. చిన్నారులతోపాటు వృద్ధులు, స్త్రీ ,పురుషులిద్దరికీ ఎంతో మేలు చేస్తాయి గుమ్మడి గింజలు. గుమ్మడికాయను చాలాసార్లు తినే ఉంటారు కదా..? కానీ వాటి లోపల ఉన్న విత్తనాలు చేసే మేలు అంతా ఇంతా కాదు..అవేంటో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇది కూడా చదవండి..కిడ్నీ సమస్యలున్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు..?
హార్ట్ హెల్త్..
గుమ్మడి విత్తనాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే, అవి స్ట్రోక్ ,గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుమ్మడి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున, వాటిని తినడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలు పెరుగుతాయి. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
గుమ్మడి గింజలు..
ఉదయం అల్పాహారంగా, లంచ్ , డిన్నర్‌లో కూడా గుమ్మడి గింజలు చేర్చుకోవచ్చు. అయితే వాటిని అల్పాహారంలో తినడం ఉత్తమం. అంతేకాదు వాటిని వేయించుకొని, మొలకెత్తనవి, లేదా ఓట్స్‌లో జోడించడం ద్వారా కూడా తినవచ్చు. వీటిని రోజూ తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.
లైంగిక ఆరోగ్యానికి..
గుమ్మడి గింజల వినియోగం పురుషుల లైంగిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీర్యకణాల నాణ్యతను పెంచే గుణాలు వీటిలో ఉంటాయి. గుమ్మడి గింజలు తినడం వల్ల పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంధి ఆరోగ్యంగా ఉంటుంది. వాటి వినియోగం పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని అనేక అధ్యయనాలలో వెల్లడైంది.
స్కిన్ కేర్..
గుమ్మడి విత్తనాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కావాలంటే, ఈ విత్తనాలను తినాలి.
చక్కర స్థాయిలు..
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.మెగ్నీషియం అధికంగా ఉండే ఈ విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా మధుమేహం ముప్పును కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాదు అధిక బరువు సమస్యను పరిష్కరంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇది కూడా చదవండి..ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com