సాక్షి లైఫ్: పెయిన్ కిల్లర్స్ ప్రాణాలను తీసే యమపాశాలుగా మారుతున్నాయి. తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం కోసం చాలామంది వాడే 'ట్రామడాల్' (Tramadol) మాత్రల విషయంలో కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలిక నొప్పులను తగ్గించడంలో ఇది స్వల్ప ప్రభావమే చూపుతుందని, అదే సమయంలో ప్రాణాంతకమైన దుష్ప్రభావాలను కలిగిస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి 'బీఎమ్‌జే' (BMJ) నివేదిక ప్రకారం, ఈ మందు ప్రయోజనాల కంటే కలిగించే నష్టాలే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఇది కూడా చదవండి...Expert Guidelines : విజృంభిస్తున్న కొత్త వైరస్ వేరియంట్: సబ్-క్లేడ్ కె నివారణకు నిపుణుల మార్గదర్శకాలు..!
ఇది కూడా చదవండి...Hair loss : జుట్టు రాలడాన్ని నిరోధించడానికి వైద్య చికిత్సలు ఎంతవరకు సురక్షితం..?
ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
గుండెపై తీవ్ర ప్రభావం..
సాధారణంగా మోకాళ్ల నొప్పులు,ఆస్టియో ఆర్థరైటిస్ (osteoarthritis), వెన్నునొప్పి వంటి సమస్యలకు వైద్యులు ఈ మందును సూచిస్తుంటారు. అయితే, దీని వాడకం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా:
గుండెకు రక్తప్రసరణ తగ్గడం వల్ల తీవ్రమైన ఛాతీ నొప్పి (Chest Pain) వస్తుంది. అంతేకాదు గుండె కండరాలు బలహీనపడే ప్రమాదంతోపాటు గుండె వైఫల్యానికి దారితీయవచ్చు. గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనులు పూడుకుపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
మానసిక స్థితిపై కూడా ప్రభావం..
ట్రామడాల్ అనేది ఒక 'సింథటిక్ ఓపియాయిడ్'. ఇది నేరుగా మెదడులోని నరాలపై పనిచేస్తుంది. దీనివల్ల కాలక్రమేణా మందుపై అలవాటు (Addiction) పెరగడమే కాకుండా.. మగత, గందరగోళం, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇతర మందులతో కలిపి వాడినప్పుడు 'సెరోటోనిన్ సిండ్రోమ్' వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
జాగ్రత్తలు పాటించాల్సిందే..
తలనొప్పి లేదా చిన్నపాటి నొప్పులకు మెడికల్ షాపుల్లో నేరుగా కొని వాడటం అత్యంత ప్రమాదకరం. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాలి.
ఇలాంటి మెడిసిన్స్ దీర్ఘకాలంగా వాడుతున్న వారు ఒక్కసారిగా ఆపేస్తే వాంతులు, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మోతాదును క్రమంగా తగ్గించాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. నొప్పి నివారణకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఫిజియోథెరపీ వంటివి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వంటి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com