Protein : ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..
సాక్షి లైఫ్ : ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్, సిక్స్‌ప్యాక్ బాడీల వైపు యువత మొగ్గు చూపుతోంది. కండరాల పుష్టి కోసం, బరువు తగ్గడం కోసం చాలామంది తమ ఆహారంలో ప్రోటీన్ (మాంసకృత్తులు) పరిమాణాన్ని విపరీతంగా పెంచేస్తున్నారు. అయితే, శరీరానికి ప్రోటీన్ ఎంత అవసరమో.. అది మితిమీరితే అంతే ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా లేకుండా అధికంగా ప్రోటీన్ సప్లిమెంట్లు, హై-ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల శరీరానికి జరిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
1. మూత్రపిండాలపై తీవ్ర ఒత్తిడి..
అధిక ప్రోటీన్ వల్ల శరీరంలో చేరే అదనపు వ్యర్థాలను వడపోసేందుకు కిడ్నీలు పరిమితికి మించి శ్రమించాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీల పనితీరును మందగింపజేస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది మరింత ప్రమాదకరం.
2. డీహైడ్రేషన్..
శరీరంలో ప్రోటీన్ జీర్ణం కావడానికి , అది విసర్జించబడటానికి ఎక్కువ మొత్తంలో నీరు అవసరమవుతుంది. ఒకవేళ ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటూ, తగినంత నీరు తాగకపోతే శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల నిరంతరం తలనొప్పి, తీవ్ర అలసట, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి.
3. జీర్ణక్రియ అస్తవ్యస్తం..
చాలామంది కేవలం ప్రోటీన్ లభించే ఆహారాలపైనే దృష్టి పెట్టి, పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా మలబద్ధకం (Constipation) వేధిస్తుంది.
కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి.
కడుపు ఎప్పుడూ బరువుగా అనిపిస్తుంది.
4. బరువు తగ్గాలనుకుంటే.. పెరిగే అవకాశం..!
ప్రోటీన్ ఎక్కువైతే శరీరంలో క్యాలరీల శాతం పెరుగుతుంది. మన శారీరక శ్రమకు మించి తీసుకునే అదనపు ప్రోటీన్ క్రమంగా కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతుంది. ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉంది.
5. హార్మోన్ల అసమతుల్యత..
పరిమితికి మించి ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది మానసిక స్థితిని (Mood) ప్రభావితం చేస్తుంది. దీనివల్ల తరచూ చిరాకు రావడం, నిద్రలేమి సమస్యలు,హఠాత్తుగా నీరసించిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అమృతం అయినా మితిమీరితే విషమే అవుతుంది. కాబట్టి, మీ శరీర తత్వానికి, శారీరక శ్రమకు తగినట్లుగా ఎంత ప్రోటీన్ తీసుకోవాలో నిపుణుల సమక్షంలో నిర్ణయించుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
