NCRB report : దేశంలోనే 3స్థానంలో మధ్యప్రదేశ్.. పెరుగుతున్న ఆత్మహత్యలు.. ఒక్క ఏడాదిలోనే 15వేల మంది బలి.. వెల్లడించిన ఎన్‌సీఆర్‌బీ
సాక్షి లైఫ్ : మధ్యప్రదేశ్‌లో ఆత్మహత్యలు, నేరాల సంఖ్య కలవరపెడు తోంది. రాష్ట్రంలో సామాజిక, మానసిక ఆరోగ్య పరిస్థితులు ఆందోళన కరంగా మారుతున్నాయని జాతీయ నేర గణాంక బ్యూరో (National Crime Records Bureau) తాజా నివేదిక స్పష్టం చేసింది. ఒక్క ఏడాది వ్యవధిలోనే రాష్ట్రంలో 15,491 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో ఇది 9.1 శాతమని, ఈ గణాంకాలతో మధ్యప్రదేశ్ దేశంలోనే మూడో స్థానానికి చేరిందని నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
మృత్యుపాశానికి కారణాలివే..
రాష్ట్రంలో పెరుగుతున్న ఆత్మహత్యలకు ప్రధానంగా అనారోగ్యం, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక కుంగుబాటు కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాదాపు 3,000 మందికి పైగా తీవ్రమైన శారీరక వ్యాధుల భారంతో తనువు చాలించారు. కుటుంబ బాధ్యతలు, గృహ ఒత్తిడి తట్టుకోలేక మహిళలు, ముఖ్యంగా గృహిణులు ఆత్మహత్యలకు పాల్పడటం విషాదకరం. చదువుల ఒత్తిడి, పోటీ పరీక్షల భయం, నిరుద్యోగం యువతను మానసిక కుంగుబాటులోకి నెడుతున్నాయి. పంట నష్టాలు, అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాతలు సైతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
మహిళా రక్షణ ప్రశ్నార్థకం..?
మహిళలపై నేరాల విషయంలోనూ మధ్యప్రదేశ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 2024లో రాష్ట్రవ్యాప్తంగా 32,000కు పైగా మహిళలపై వేధింపులు, హింసాత్మక కేసులు నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో ఒకటైన ఇండోర్, మహిళలపై నేరాల్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.
చిన్నారులకు తప్పని ముప్పు..
పిల్లలపై జరుగుతున్న అకృత్యాలు, సైబర్ నేరాలు రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడుల విషయంలోనూ రాష్ట్రం అగ్రగామిగా ఉండటం గమనార్హం. కేవలం చట్టాల ద్వారానే కాకుండా, మానసిక ఆరోగ్య సేవలను విస్తరించడం, సామాజిక అవగాహన పెంచడం ద్వారానే ఈ ధోరణిని అరికట్టగలమని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. యువతకు, ఒత్తిడిలో ఉన్నవారికి తక్షణ కౌన్సెలింగ్ అందించాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..