స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి..? 

సాక్షి లైఫ్ : H1N1 ఫ్లూ లేదా "స్వైన్ ఫ్లూ". ఇది ఇన్ఫ్లుఎంజా ఏ సబ్ వేరియంట్. తొలిసారిగా 2009-10ల్లో H1N1 వైరస్ మొదలైంది. ఈ వైరస్  పందులు, పక్షులు, మనుషులకు సోకే ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌. స్వైన్ ఫ్లూ లక్షణాలకు సంబంధించి, వైద్యులు స్వైన్ ఫ్లూ (H1N1 ఇన్ఫ్లుఎంజా) లక్షణాలలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారటం లేదా మూసుకుపోవడం, శరీర నొప్పి, తలనొప్పి, అలసట, కొన్నిసార్లు వాంతులు లేదా విరేచనాలు అవుతుంటాయి. ఇది తీవ్రమైతే  న్యుమోనియా, శ్వాసకోశ వైఫల్యానికి కూడా దారితీస్తుంది.

స్వైన్ ఫ్లూ ప్రమాద కారకాలు.. 

స్వైన్ ఫ్లూ ప్రమాద కారకాలు సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు 
 వంటి కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి తొందరగా వ్యాపించే అవకాశం ఉంది.

 ఇది కూడా చదవండి.. రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి..?

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?  

మీకు ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తే,  వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ప్రత్యేకించి స్వైన్ ఫ్లూ వ్యాప్తి ఉన్న ప్రాంతానికి వెళ్లి ఉంటే లేదా స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న వారికి దగ్గరగా ఉన్నా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది.

ఇది కూడా చదవండి..  సమ్మర్ లో వేడి చేస్తోందా..? ఇది మీకోసమే..!  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-care-tips swine-flu-symptoms swine-flu swine-flu-cases h1n1-flu

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com