అత్యంత ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గుమ్మడికాయ గింజలు..  

సాక్షి లైఫ్ : పోషకాహారానికి పవర్‌హౌస్ అని పిలిచే గుమ్మడికాయ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. రుచి పరంగా, ఆరోగ్య పరంగా ఎంతో బాగుంటాయి. గుమ్మడికాయ గింజలు చూడడానికి చిన్న పరిమాణంలో కనిపిస్తాయి. కానీ వీటిని మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సూపర్ ఫుడ్ గా భావిస్తారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, జింక్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

 

ఇది కూడా చదవండి..మహిళలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువ..? కారణాలేంటి..?

ఇది కూడా చదవండి..రక్త ప్రసరణ తగ్గినప్పుడు కనిపించే ఏడు లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..వెన్నుపాము దెబ్బతినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, మీ రోగనిరోధక శక్తిని పెంచడం వరకు, ఈ విత్తనాలు స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరూ తమ  ఆహారంలో భాగం చేసుకోవాల్సిన బెస్ట్ సూపర్ ఫుడ్ ఇవి.తాజా పండ్లు లేదా ఆకుకూల సలాడ్లలో గుమ్మడికాయ గింజలను కలిపి తీసుకోవచ్చు. ఇవి సలాడ్ కు ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. దానికి అవసరమైన కొవ్వులు ,ప్రోటీన్లను జోడిస్తాయి.

 
 ఎనర్జీ బార్‌లలో..  
ఇంట్లో ఎనర్జీ బార్లు తయారుచేసేటప్పుడు, గుమ్మడికాయ గింజలు, ఓట్స్ , తేనె కలిపి తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన, రుచికరమైన స్నాక్, ముఖ్యంగా వ్యాయామం తర్వాత ఇవి తీసుకోవడం ద్వారా మరింత ఎనర్జిటిక్ గా ఉండొచ్చు.  

సూప్ లో కూడా..  
కాల్చిన గుమ్మడికాయ గింజలను పాలకూర, టమోటా లేదా గుమ్మడికాయ సూప్‌లో కలపండి. ఇవి సూప్‌ను మరింత రుచికరంగా, పోషకంగా మారుస్తాయి.

గుమ్మడికాయ గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ,ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎంతో మేలుచేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని నిగనిగలాడేలా ఉంచుతాయి. 

 

ఇది కూడా చదవండి..ఆక్యుపంక్చర్ చికిత్సకు ముందు ఎలాంటి వైద్య పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..స్లీప్ పెరాలసిస్ నివారణ ఎలా..?

ఇది కూడా చదవండి..టాన్సిల్స్‌ నొప్పి తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : pumpkin-seeds pumpkin-seeds-benefits benefits-of-pumpkin-seeds health-benefits-of-pumpkin-seeds pumpkin-seeds-health-benefits pumpkin-seeds-benefits-for-men pumpkin-seeds-benefits-for-women pumpkin-seeds-uses are-pumpkin-seeds-healthy benefits-of-pumpkin-seeds-for-men are-pumpkin-seeds-good-for-you pumpkin pumpkin-seeds-for-hair pumpkin-seeds-how-to-eat pumpkin-seeds-nutrition pumpkin-seed-benefits benefits-of-eating-pumpkin-seeds
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com