టాన్సిల్స్ నొప్పి తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు..
సాక్షి లైఫ్ : రాళ్ళ ఉప్పు వేసిన వేడి నీటితో గోంతు కడిగడం..వేడి నీటిలో రాళ్ళ ఉప్పు వేసి గొంతు వరకు పోసుకుని పుక్కిలించండి. ఇది రోజుకు నాలుగు సార్లు, రెండు రోజులపాటు చేయడం ద్వారా 90శాతం నొప్పి తగ్గిపోతుంది. వేడిగా నీరు : తాగే నీరు వేడిగా ఉండేలా చూసుకోవడం, గొంతులో నొప్పి తగ్గడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి.నిద్ర లేమి ఏకాగ్రత సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?
అరటి , పసుపు కలిపి పాలు తాగడం:
ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగండి. రాత్రి పడుకునే ముందు పసుపు, మిరియాలు, పంచదార (లేకపోతే ఖర్జూరం పొడి) కలిపి పాలు మరిగించి, వడకట్టి తాగడం వల్ల కూడా గొంతులో నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది.
వృద్ధుల కోసం:
వృద్ధులకు టాన్సిల్స్ నొప్పి ఉంటే, మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడి, తేనె కలిపి రెండు పూటలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలానే తాగే నీరు కూడా వేడిగా ఉండేలా చూసుకోండి. అదే వృద్దులకు గొంతులో నొప్పి , కఫం తగ్గాలంటే మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరించాలి" అని ఆయుర్వేద నిపుణులు నవీన్ అంటున్నారు.
"ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు తాగాలి.రాత్రి పడుకోవడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు దంచిన ముక్కలు, పంచదార కొంచెం, షుగరు లేకపోతే, ఒకవేళ షుగర్ ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి తాగాలి. వృద్ధులుకి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపంలో ఉండాలి. ఇవన్నీ చేసినా కూడా నొప్పి తగ్గకపోతే అప్పుడు వైద్యులను తప్పనిసరిగా సంప్రదించండి.
ఇది కూడా చదవండి.రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే మునగఆకు..
ఇది కూడా చదవండి.థైరాయిడ్ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహార నియమాలు ఫాలోఅవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
