రక్త ప్రసరణ తగ్గినప్పుడు కనిపించే ఏడు లక్షణాలు.. 

షేర్ చేయండి:
రక్త ప్రసరణ తగ్గినప్పుడు కనిపించే ఏడు లక్షణాలు.. 

సాక్షి లైఫ్ : రక్త ప్రసరణ (బ్లడ్ సర్క్యులేషన్) మన శరీరంలో రక్తం, ఆక్సిజన్ తోపాటు పోషకాలను అన్ని అవయవాలకు సరఫరా చేసే ప్రక్రియ. ఇది గుండెకు రక్తాన్ని సక్రమంగా పంపుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే, అది మన ఆరోగ్యంపై అనేక ప్రభావాలను చూపిస్తుంది. రక్త ప్రసరణ తగ్గినప్పుడు, శరీరానికి తగిన రక్తం, ఆక్సిజన్, పోషకాలు సరిగా అందవు. అలాంటప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.  

 

ఇది కూడా చదవండి..బ్రౌన్ రైస్ తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?

ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..

 

చర్మం రంగులో మార్పు: రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల చర్మం రంగు కూడా మారవచ్చు. చర్మం పసుపు లేదా ఎరుపు రంగులోకి మారుతుంది.జుట్టు రాలడం: రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. కండరాల తిమ్మిరి: రక్త ప్రసరణ తగ్గడం వల్ల కండరాలు తిమ్మిరిగా అనిపిస్తాయి.

 మన శరీరంలో రక్తం నిరంతరం ప్రవహిస్తుంది, దీనిని రక్త ప్రసరణ అంటారు. ఈ ప్రవాహం మన హృదయ స్పందన వల్ల సంభవిస్తుంది.   ఇది మన శరీరం అంతటా ఆక్సిజన్, పోషకాలను రవాణా చేస్తుంది. ఈ పోషకాలు కణాలకు శక్తిని అందిస్తాయి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి.

కొన్ని కారణాల వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ మందగించినప్పుడు లేదా అంతరాయం ఏర్పడినప్పుడు, అది అనేక సమస్యలను కలిగిస్తుంది. రక్త ప్రసరణ తగ్గడం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు తగినంత ఆక్సిజన్ ,పోషకాలు అందవు. దీని కారణంగా, శరీర భాగాలు సరిగా పనిచేయలేవు.  దీని కారణంగా అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. 


 రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరంలోని వివిధ భాగాలలో కనిపిస్తాయి. 
 చేతులు, కాళ్ళు చల్లబడడం: రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కలిగే అత్యంత సాధారణ సమస్య చేతులు, కాళ్ళలో చల్లగా అనిపించడం. వేసవి లేదా శీతాకాలం కావచ్చు, మీ చేతులు, కాళ్ళు చల్లగా ఉంటే, అది రక్త ప్రసరణ సరిగా జరగడంలేదనడానికి సంకేతం.

వాపు: రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలలో వాపు రావచ్చు. ఈ వాపు పాదాలు, చీలమండలు లేదా చేతుల్లో సంభవించవచ్చు.అలసట, బలహీనత: రక్తంలో ఆక్సిజన్ లేనప్పుడు ఎల్లప్పుడూ అలసటగా  బలహీనంగా అనిపిస్తుంది.తిమ్మిరి లేదా జలదరింపు: రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల, చేతులు ,కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు సమస్య ఉండవచ్చు. గాయాలు: మీ శరీరంపై ఏదైనా చిన్న గాయం అయితే, అది చాలా నెమ్మదిగా నయం అవుతుంటే, అది రక్త ప్రసరణ సరిగా లేనట్లు గ్రహించాలి. 

 

ఇది కూడా చదవండి.. కత్తి దాడిలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ వెన్నెముకకు తీవ్ర గాయాలు.. వైద్యులు ఏమంటున్నారంటే..?

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే.. 

 

గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.