శీర్షాసనంతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?
సాక్షి లైఫ్ : యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయి, ఆయా ఆసనాలు చేయడం ద్వారా ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండడానికి అవకాశం ఉంటుందని యోగా నిపుణులు వెల్లడిస్తున్నారు. అటువంటి వాటిలో ఒకటి శీర్షాసనం. దీనిని ఆసనాల రాజు అని పిలుస్తారు. ఈ శీర్షాసనం వేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో బ్లడ్ సర్కులేషన్ సరిగా అవ్వడంలేదని తెలిపే 8 లక్షణాలు..?
విటమిన్ బి1లోపిస్తే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?
యోగా ప్రపంచంలో, 'శీర్షాసనం'ను 'ఆసనాల రాజు' అని పిలుస్తారు ఎందుకంటే..? శీర్షాసనం వేయడం ద్వారా తల నుంచి కాలి వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం చేస్తున్నప్పుడు, తల కిందికి , పాదాలు పైకి ఉంచాల్సి ఉంటుంది. దీని వల్ల పాదాల నుంచి తల వరకు రక్త ప్రసరణ పెరుగుతుంది.
అంతేకాదు పాదాలు, కడుపు, జుట్టు, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరమవుతాయి. దీంతోపాటు మెదడుకు మెరుగైన రక్త ప్రసరణ కూడా జరుగుతుంది. తద్వారా తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి..స్త్రీలలో క్యాల్షియం లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టులు ఏమిటి..?
ఇది కూడా చదవండి..హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ఎలాంటి మహిళలకు అవసరం..?
ఇది కూడా చదవండి..పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మీకు తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
