పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మీకు తెలుసా..?

సాక్షి లైఫ్ : పుట్టగొడుగులను శాఖాహారులు తరచుగా నాన్ వెజ్ అంటారు. రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా, ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. కానీ కొంతమందికి ఇవి తినడం వల్ల హాని కలిగే అవకాశం ఉందని మీకు తెలుసా..? ఎలాంటి వ్యక్తులు తిన కూడదు..? ఎలాంటి వ్యక్తులు తినొచ్చు..? పుట్టగొడుగులు పోషక విలువలు కలిగి ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇష్టపడుతుంటారు. ఇది వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తారు. కాల్షియం, విటమిన్ "డి", పొటాషియం, నికోటినిక్ యాసిడ్  వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. పుట్టగొడుగు అనేది ఒక రకమైన ఫంగస్. ఇవి తినడంవల్ల కొంతమందికి అలెర్జీలు లేదా జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.  

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

కిడ్నీ సమస్యలు..  

కిడ్నీ వ్యాధితో బాధపడేవారు పుట్టగొడుగులను తినకూడదని వైద్యనిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగులు మూత్రపిండాలపై అధిక భారాన్ని కలిగిస్తాయి. వీటిలో మూత్రపిండాల వ్యాధిని మరింత తీవ్రతరం చేసే కొన్ని అంశాలున్నాయి.

అలెర్జీ సమస్య.. 

పుట్టగొడుగులలో ఉండే కొన్ని అంశాలు కొంతమందికి అలెర్జీని కలిగిస్తాయి. పుట్టగొడుగులను తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు, దురదలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు రావచ్చు. పుట్టగొడుగులను తిన్న తర్వాత మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు.. 

పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి పుట్టగొడుగులు  జీర్ణం అవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి, పుట్టగొడుగులను పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి.

ఫుడ్ పాయిజన్..  

పుట్టగొడుగులు సరిగా ఉడకకపోయినా, పాడైపోయినా అవి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు వాంతులు, విరేచనాలు, జ్వరం మొదలైనవి.


 గర్భిణీలు..

గర్భిణీలు, పిల్లలకు పాలిస్తున్న మహిళలు పుట్టగొడుగులను తీసుకునే ముందు తప్పకుండా డాక్టరును సంప్రదించాలి. కొన్ని రకాల పుట్టగొడుగులు పుట్టబోయే బిడ్డకు లేదా తల్లిపాలు తాగే బిడ్డకు హాని కలిగిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

 

ఇది కూడా చదవండి..ఎలాంటి వారిపై షింగిల్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..? 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..? 

 

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health pregnant-women side-effects mushrooms mushrooms-health-benefits new-mothers mother-milk pregnancy-care eating-mushrooms mushroom-side-effects health-risks-of-mushrooms mushrooms-in-winter health-benefits-of-mushrooms mushroom-consumption allergic-reactions-to-mushrooms mushroom-toxicity mushroom-nutrition mushrooms-and-digestion
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com