సాక్షి లైఫ్ : విటమిన్ బి1, అంటే థియామిన్, మన శరీరానికి అత్యంత ముఖ్యం అయిన ఒక ప్రధానమైన పోషకం. ఇది ప్రధానంగా నాడీ వ్యవస్థ, గుండె, పేగుల పనితీరు కోసం అవసరం. విటమిన్ బి1 లోపం తలెత్తినప్పుడు వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ లోపం నుంచి ఎలా బయటపడొచ్చు అంటే..?
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్లు బి2, బి3, బి6, సి, ఈ అండ్ కె వంటి అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి-1ను పొందవచ్చు.
విటమిన్ బి1 లేదా థయామిన్ అనేది నీటిలో కరిగే విటమిన్, ఇది శరీరం కార్బోహైడ్రేట్‌లను శక్తిగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. విటమిన్ బి1 లోపం సాధారణంగా బెరిబెరి వ్యాధికి కారణమవుతుంది. అంతేకాదు నరాల సంబంధిత రుగ్మతలు కూడా పెంచుతుంది. ఇది కాకుండా, విటమిన్ బి1లోపిస్తే బరువు తగ్గడం, అనోరెక్సియా సమస్య తలెత్తుతుంది. తీవ్రమైన సందర్భాల్లో గందరగోళం, జ్ఞాపకశక్తి సమస్యలు కూడా సంభవించవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ఎలాంటి మహిళలకు అవసరం..?
ఇది కూడా చదవండి..పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మీకు తెలుసా..?
ఇది కూడా చదవండి..స్త్రీలలో క్యాల్షియం లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టులు ఏమిటి..?
ఈ గింజల్లో..
ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి1ను పొందవచ్చు. అటువంటి వాటిలో సన్ ఫ్లవర్ సీడ్స్ చాలా ముఖ్యమైనవి. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ బి1 తగినంత మొత్తంలో ఉంటుంది. 100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాలలో 0.106 ఎంజీ విటమిన్ బి1 పొందవచ్చు.
ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com